పుచ్చకాయ పేరుచెబితే వేసవిలో నోరూరుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా పుచ్చకాయలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. రోడ్లమీద వెళుతున్నప్పుడు నలుపు రంగు గింజలతో చూడగానే నోరూరించేలా ఎరుపురంగు పుచ్చపండు కనిపిస్తుంది. సామాన్యులు సైతం కొనుక్కోగలిగే ధరల్లో ఇవి లభ్యమవడం వల్ల వీటికి ప్రాధాన్యత బాగా పెరిగింది.
ఏ సీజన్లో అయినా, కేజీ 50 నుంచి 100కి మించకుండా వుంటుంది. ఒక్కోసారి అయితే కిలో 14 నుంచి 20 రూపాయల ధర పలుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి మీకు తెలుసా. దాని ధర చెబితే మీ మైండ్ బ్లాంక్ కాకమానదు. జపాన్‌లో దొరికే ఒకరకం పుచ్చకాయ ధర మన కరెన్సీలో అయితే 20 వేల వరకూ వుంటుంది. అత్యధికంగా దాని ధర వేలంలో 4లక్షల వరకూ పలుకుతుంది. ఈ తరహా పుచ్చకాయలకు గిన్నిస్ బుక్‌లో కూడా స్థానం కల్పించారని దాని స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా లేత, ముదురు ఆకుపచ్చ వర్ణంలో పుచ్చకాయలు మనకు తెలుసు. జపాన్ కి చెందిన ‘డెన్సుకే వాటర్‌మెలన్’గా పిలుచుకునే రకాలను పండిస్తారు. ఫుట్‌బాల్ ఆకారంలో గుండ్రంగా ఉండే వీటిని కొనడానికి ఇతర దేశాలవారూ ముందుకి వస్తారు. వేలంలో ఎక్కువ ధరకు వాటిని ఎగరేసుకుని పోతారు. ఈ పుచ్చకాయలు పండించాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఓపిక కూడా అవసరం అంటారు రైతులు. చాలా తక్కువగా మాత్రమే ఇవి పండుతాయి. ఖరీదైన ఈ పుచ్చకాయను పెళ్ళిళ్ళలో బహుమతులుగా ఇస్తారు. వీటిని ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తారు. డెన్సుకే వాటర్ మిలన్ వేలంలో దక్కించుకోవడం ప్రెస్టీజియస్ గా భావిస్తారు.
Read Also: Smart Solar Hotel: ఆ హోటల్ అంతా సౌర వెలుగులు