Site icon NTV Telugu

Foods to Avoid at Night: రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్.. ఒకవేళ తింటే..?

Foods

Foods

Foods to Avoid at Night: సగానికి పైగా వ్యాధులకు మూల కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నా, జీర్ణ సమస్యలు వేధిస్తున్నా.. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. మీ తప్పు టైమ్‌లో పోషకాహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కొంతమంది రాత్రి పూట భోజనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు నిద్ర బాగా పట్టినా జీర్ణవ్యవస్థ ఎఫెక్ట్‌ అవుతుంది. మసాలా, కెఫిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం రాత్రి పూట తీసుకుంటే మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అసలు రాత్రి పూట తీసుకోకూడని ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: GST: జీఎస్టీకి ముందు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వస్తువులు యూరప్ మీదుగా పంపాల్సి వచ్చేదా..?

మాంసాహారం: రాత్రి పూట పొట్ట నిండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకుంటే పొట్ట రావడం ఖాయం. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు, కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. మీకు అంతగా మాంసాహారం తినాలనిపిస్తే రాత్రి ఏడు గంటలకే తినేయండి. రాత్రి పది వరకు నిద్రపోవద్దు. మధ్యలో ఓ అరగంట వాకింగ్ కూడా చేయండి.

ఆరెంజ్ జ్యూస్: సాధారణంగా రాత్రిపూట సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను నివారించడం వల్ల మీ ప్రేగు కదలికలకు మంచిది. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్‌లో పండు కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని రాత్రిపూట తాగడం మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

బీట్‌రూట్: బీట్‌రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్‌రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి.

క్యాబేజీ, కాలీ ఫ్లవర్: వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తిన్నా కూడా త్వరగా జీర్ణం కావు. కాబట్టి ఈ కూరలు మధ్యాహ్నం పూటే వండుకోవాలి. రాత్రి పూట తింటే జీర్ణక్రియకు ఆటంకం కలగడం ఖాయం. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారిపోతుంది. కనుక త్వరగా బరువు పెరిగిపోతారు.

ఆల్కహాల్: రాత్రయితే చాలు సిట్టింగ్ పేరుతో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రి తాగేవారందరికీ అధికంగా పెరుగుతుంది. రాత్రిపూట మద్యం తీసుకోవడాన్ని దూరం పెట్టాలి.

టీ, కాఫీలు: కొందరికి టీ, కాఫీలు ఎప్పుడు తాగాలో కూడా తెలియదు. ప్రతి మూడు, నాలుగ్గంటలకోసారి కాఫీ, టీలు తాగేస్తుంటారు. ఏముంది గుక్కెడు టీ నీళ్లేగా అంటుంటారు. కానీ ఆ గుక్కెడే బరువు పెరగడానికి సహాయపడతాయి. టీ, కాఫీలలో కెలోరీలు, కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని రాత్రి పూట తాగడం వల్ల ఆ కెలోరీలన్నీ శరీరంలో చేరతాయి. అంతేకాదు కెఫిన్ వల్ల నిద్ర సరిగా పట్టక బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు సాయంత్రం నాలుగ్గంటల తరువాత తాగక పోవడం ఉత్తమం.

మామిడి: మామిడి పండ్లలో పోషకాలు, ప్రొటీన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. కానీ మీరు రాత్రిపూట మామిడి పండు తిన్నప్పుడు అందులోని ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను ఎక్కువసేపు పని చేయిస్తుంది. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది.

 

 

Exit mobile version