మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే.. అంతర్గత అవయవాలు (ఆర్గాన్స్) శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. రక్తం నుంచి మెదడు వరకు, కాలేయం నుంచి కిడ్నీల వరకు.. ప్రతి అవయవం తన పనిని సమర్థంగా చేయాలంటే సరైన పోషకాలు ఎంతో అవసరం. ప్రకృతి మనకు ఇచ్చిన కొన్ని ఆహార పదార్థాలు అవయవాలను సహజంగా శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్షణ. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు:
రక్తం శుద్ధిగా ఉంటేనే శరీరానికి సరైన ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. బీట్‌రూట్ రక్తాన్ని శుభ్రం చేసి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి రక్తంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
మెదడుకు మేలు చేసే ఆహారాలు:
మెదడు ఆరోగ్యానికి బ్లూబెర్రీస్ చాలా మంచివి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పసుపు మెదడులోని వాపును తగ్గించి నాడీ వ్యవస్థను బలపరుస్తుంది.
కళ్ల ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు:
క్యారెట్లు కళ్ల చూపును మెరుగుపరచడంలో ప్రసిద్ధి. కేల్ ఆకుకూరల్లో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిలగడ దుంపలు (స్వీట్ పొటాటోస్) కళ్లను రక్షించే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
పేగులను శుభ్రం చేసే ఆహారాలు:
అలోవెరా జీర్ణక్రియను మెరుగుపరచి పేగులను శుభ్రంగా ఉంచుతుంది. దోసకాయ శరీరాన్ని హైడ్రేట్ చేసి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. గ్రీన్ ఆపిల్ ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు:
బీట్‌రూట్ కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. క్రాన్‌బెర్రీస్, సెలరీ, దోసకాయలు కిడ్నీలను సహజంగా శుభ్రం చేసే ఆహారాలుగా ఉపయోగపడతాయి.
కాలేయానికి మేలు చేసే ఆహారాలు:
కాలేయం శరీరానికి ప్రధాన డిటాక్స్ అవయవం. బీట్‌రూట్, నిమ్మకాయలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఊపిరితిత్తులను శుభ్రం చేసే ఆహారాలు:
పైనాపిల్‌లో ఉండే ఎంజైమ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది. వెల్లుల్లి లంగ్స్‌లోని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫైనల్లీ:
ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే, శరీరంలోని అవయవాలు సహజంగా శుభ్రపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం కలిస్తేనే.. సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది.
