Site icon NTV Telugu

Fatty liver: ఫ్యాటీ లివర్‌ ఉన్నవారు ఇలా చేయండి, కొద్ది రోజుల్లోనే నయం..

Fatty Liverss

Fatty Liverss

Fatty liver: ‘‘ఫ్యాటీ లివర్’’ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. కాలేయానికి వచ్చే ఈ పరిస్థితి వల్ల మొత్తం శరీర మెటాబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మద్యం, స్మోకింగ్ అలవాట్లు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే, ఫ్యాటీ లివర్ పరిస్థితిని సహజంగా ‘‘రివర్స్’’ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, కాబట్టి ముందుగానే గుర్తిస్తే నయం చేయడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు.

డైట్‌తో చెక్:

ఫ్యాటీ లివర్ తగ్గించడానికి మందులు ముఖ్యం కాదు, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే చాలు. మన లైఫ్ స్టైల్ మార్చు చేసుకున్న తర్వాత దాదాపు 68 శాతం మంది రోగులు కాలేయ పనితీరును మెరుగుపరుచుకున్నట్లు అధ్యయనాలు చెబుతున్నారు. చక్కెరలు తగ్గించడంతో పాటు ఫైబర్, ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఉండాలని సూచిస్తున్నారు.

ఏ ఆహారం బెటర్:

ఫ్యాటీ లివర్ తగ్గడంలో మనం తీసుకునే ఫుడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన చక్కెరలు, ప్రాసెసుడ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించడం చాలా ముఖ్యం. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, నట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కాలేయం రిపేర్‌కు సహాయపడుతాయి.

వ్యాయామం, బరువు తగ్గడం కీలకం:

ఫ్యాటీ లివర్ కాలక్రమేనా అభివృద్ధి చెందుతుంది. దీనిని నయం చేయడానికి కనీసం 6 నెలల నుంచి ఒక ఏడాది పడుతుంది. మన బరువులో 7-10 శాతం బరువు తగ్గినా కూడా కాలేయంలో కొవ్వు, వాపు గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ ఫైబర్ తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా రోజుకు ఒక 30 నిమిషాల నుంచి 1 గంట వ్యాయామం చేయాలి. శారీరక చురుకుదనం చాలా ముఖ్యం.

Exit mobile version