Soft Pulka Tips: పుల్కాలు గట్టిగా వస్తున్నాయా? ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే బంతిలా పొంగుతాయి!

Soft Pulka Tips

Soft Pulka Tips

Soft Pulka Tips: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి భోజనంలో ఎక్కువగా తినడానికి బదులు, తేలికగా జీర్ణమయ్యే పుల్కాలను తినడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో పుల్కాలు చేస్తే అవి కాసేపటికే అప్పడాల్లా గట్టిగా మారిపోతుంటాయని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. అదే డాబాల్లో లేదా హోటళ్లలో అయితే దూది లాగా మెత్తగా, పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటాయి. మరి హోటల్ మాస్టర్లు చేసే ఆ సాఫ్ట్ పుల్కాల రహస్యం ఏంటి? వారు వాడే ఆ సీక్రెట్ చిట్కాలు ఏంటో తెలిస్తే.. మీరు కూడా ఇంట్లోనే ఎలాంటి నూనె లేకుండా, బంతిలా పొంగే ‘డాబా స్టైల్’ పుల్కాలను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఆ పర్ఫెక్ట్ తయారీ విధానం ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి (ఆశీర్వాద్ లేదా ఏదైనా): అర కిలో

×
×
Ad

ఉప్పు: ముప్పావు స్పూన్

చక్కెర: ముప్పావు స్పూన్

నూనె: సుమారు 20 మి.లీ.

నీళ్లు: తగినన్ని

పొడి పిండి: కొద్దిగా మైదా పిండి

తయారీ విధానం ..

ముందుగా ఒక పాత్రలో అర గ్లాసు నీళ్లు తీసుకొని, అందులో ముప్పావు స్పూన్ ఉప్పు, ముప్పావు స్పూన్ చక్కెర, 20 మి.లీ. నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అర కిలో గోధుమ పిండిని వేసి బాగా మాలిష్ చేస్తూ కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత పిండి బాగా కలిపిన తర్వాత, ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని, నీటిని పూర్తిగా పిండేసి ఆ క్లాత్‌ను పిండి ముద్దపై కప్పి ఉంచాలి. ఇలా సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని బాగా నాననివ్వాలి. పిండి బాగా నానిన తర్వాత, చపాతీ సైజ్ కంటే చిన్నవిగా, అప్పడం సైజ్ కంటే కొద్దిగా పెద్దవిగా ఉండేలా చిన్న చిన్న రౌండ్ ఉండలను రెడీ చేసుకోవాలి.

పుల్కాలు ఒత్తడానికి పొడి గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని ఉపయోగించాలని హోటల్ మాస్టర్లు సూచిస్తున్నారు. గోధుమ పిండి వాడితే కాల్చేటప్పుడు పెనంపై పిండి మాడిపోయి పుల్కాలు నల్లగా మారడమే కాకుండా చేదు వస్తాయని చెబుతున్నారు. ఉండలను తీసుకొని అన్ని వైపులా ఒకే రకమైన మందంతో పల్చగా, రౌండ్‌గా రుద్దుకోవాలి. ఆపై వాటికి ఉన్న అదనపు పొడి పిండిని పూర్తిగా దులుపుకోవాలి. తర్వాత దోసె పెనం లేదా ఆమ్లెట్ పెనాన్ని లైట్ వేడి మీద ఉంచాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పుల్కాను పెనంపై వేసి ఎక్కువ సేపు ఉంచకుండా, కేవలం చిన్న చిన్న బుడగలు (బబుల్స్) వచ్చేంత వరకు మాత్రమే రెండు వైపులా లైట్ గా కాల్చి (హాఫ్ బాయిల్) పక్కన పెట్టుకోవాలి. రెండు మూడు పుల్కాలు కాల్చిన ప్రతిసారీ పెనంపై ఉన్న పొడి పిండిని తూడ్చుకోవాలి, లేదంటే పుల్కాలు నల్లగా మారుతాయి. ఇలా హాఫ్ బాయిల్ చేసిన పుల్కాలను నేరుగా రుమాల్ రోటీ కడాయిపై లేదా డైరెక్ట్ మంట (గ్యాస్ స్టవ్ నెట్) పై వేసి కాలిస్తే పుల్కాలు చక్కగా బంతిలా పొంగుతాయి. ఇలా పర్ఫెక్ట్‌గా కాలిన పుల్కా పొంగడమే కాకుండా, చేత్తో నలిపితే పేపర్ లాగా విడిపోతూ ఎంతో సాఫ్ట్‌గా వస్తుంది. పుల్కాలు సరిగ్గా రాని వారు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే సులభంగా డాబా స్టైల్ పుల్కాలను ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.