NTV Telugu Site icon

Covid 19: షాకింగ్ న్యూస్.. పురుషుల వీర్యం నాణ్యత, సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం..

Male Fertility

Male Fertility

Covid Infection May Impact Semen Quality In Men: కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. మూడేళ్లు గడిచినా.. రూపాలను మార్చుకుంటూ మనుషులపై అటాక్ చేస్తోంది. ఇదిలా ఉంటే కోవిడ్ వచ్చి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా దాని ప్రభావానికి గురువుతోంది శరీరం. వ్యాధి తగ్గిపోయినా శ్వాసకోశ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలతో సతమతం అవుతున్నారు. తాజాగా అధ్యయనం మరో షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సార్స్ కోవో-2 వైరస్ సంక్రమించిన తర్వాత వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధకులు(ఎయిమ్స్) తేల్చారు. 30 మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: TSRTC : సంక్రాంతికి ఊరెళుతున్నారా.. అయితే మీకు గుడ్‌న్యూస్‌

వృషణ కణజాలంలో ఉండే యాంజియోటెన్సిన్ -కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టర్(ఏస్2) ద్వారా అవయవ నష్టానికి కోవిడ్ వైరస్ కారణం అవుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఎంజైమ్ సార్స్ కోవ్ -2 స్పైక్ ప్రొటీన్ కు గ్రాహకంగా పనిచేస్తుందని.. వైరస్ కణాల్లోకి ప్రవేశించేందుకు సహకరిస్తోందని తేలింది. దీంతో వీర్యం నాణ్యతపై ప్రభావం చూపించడంతో, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. అక్టోబర్ 2020- ఏప్రిల్ 2021 మధ్య ఎయిమ్స్ పాట్నా ఆస్పత్రి పరిశోధకులు 19-45 ఏళ్ల వయసు గల 30 మంది కోవిడ్ రోగులపై అధ్యయనం చేశారు. వీర్య కణాల నమూనాలపై రియల్-టైమ్ రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ పరీక్షను నిర్వహించారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనల్లో వీర్యం నాణ్యత, పరిమాణం, వీర్య కణాల కదలిక, స్మెర్మ్ కాన్సన్ట్రేషన్, స్మెర్మ్ కౌంట్ ఇలా ప్రతిదానిపై ప్రభావం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.