TB vaccine: హైదరాబాద్ బేస్డ్ ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ టీబీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది. క్షయవ్యాధి నివారణకు ఉద్దేశించబడిని Mtbvac వ్యాక్సిన్ పెద్దలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ రెండు ప్రయోజనాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. నవజాత శిశువులకు BCG (బాసిల్లస్ కాల్మెట్ గ్యురిన్) కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా, ఎక్కువ కాలం ప్రభావం చూపించే విధంగా, రెండోది యుక్తవయస్కుల్లో టీబీ నివారణ కోసం తయారు చేస్తున్నారు.
Read Also: BJP: “కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ నుంచి నేర్చుకోవాలి”.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్స్..
స్పానిష్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫ్యాబ్రి సహాకారంతో భారత్ బయోటెక్ ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ట్రయల్స్ ద్వారా సేఫ్టీ, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేయనున్నారు. 2025లో దీనిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత్‌లో 28 శాతం టీబీ కేసులు ఉన్నాయి, దీనిని ఎదుర్కొనేందుకు ఇది పెద్ద ముందడుగు. TB అనేది ప్రపంచంలోని ప్రధాన అంటువ్యాధి కారణాలలో ఒకటిగా ఉంది.
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, క్షయవ్యాధికి వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం మా అన్వేషణ నేడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రోత్సాహాన్ని పొందిందని, పెద్దలు మరియు కౌమారదశలో వ్యాధిని నివారించడానికి TB వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయాలనే మా లక్ష్యానికి ఈ రోజు ఒక పెద్ద అడుగు పడిందని అన్నారు.
