NTV Telugu Site icon

Vomiting While Travelling: జర్నీలో వాంతులు అవుతున్నాయా..? ఈ టిప్స్ మీకోసమే..

Travelsich

Travelsich

ఈరోజులో ప్రయాణాలు సర్వసాదారణం. జర్నీలు చేయనివారంటూ ఎవరూ ఉండరు. ఏదో పనిమీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమందికి జర్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొంతమందికి మాత్రం అస్సలు నచ్చదు. జర్నీ అంటేనే భయటపడిపోతుంటారు. దీనికి కారణాలు ఉన్నాయి.. జర్నీ సమయంలో ఎక్కడ వాంతులు చేసుకుంటారో అని జంకుతుంటారు. కొందరికి బస్సులు, ఇంకొందరికి కార్లు, మరికొందరికి రైళ్లలో ప్రాయాణం చేస్తే వాంతులు అవుతాయి. ఈ కారణంగానే ప్రయాణాలంటే భయపడిపోతుంటారు. దానికి ఇప్పుడు మంచి నివారణ మార్గాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

READ MORE: Kalki 2898 AD 25 Days: ఓరి దేవుడా.. అప్పుడే 25 రోజులయ్యిందా..?

టిప్స్ ఇవే…
వాంతులు నివారించడానికి చాలా పద్ధతులు అనుసరిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అవి పనిచేయవు. ఇప్పుడు మేము చెప్పే పద్ధతులు పాటించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఎల్లప్పుడూ కారు లేదా బస్సు ముందు భాగంలో కూర్చోండి. విమానాలు, బస్సులు ,రైళ్లలో విండో సీటును ఎంచుకోండి. పడుకుని కళ్ళు మూసుకోండి. నిద్రపోవడం లేదా హోరిజోన్ వైపు చూడటం కూడా సహాయపడుతుంది. మీరు షాక్ కు గురి కాకుండా చూసుకోండి. తరచుగా నీరు పుష్కలంగా త్రాగాలి. వాహనంలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. మీ కళ్ళు కారులోపల దృష్టి కేంద్రీకరించడానికి అవసరమైన కార్యకలాపాలను నివారించండి. అంటే ఫోన్ చూడటం వంటివి. ప్రయాణానికి ముందు లేదా సమయంలో మితమైన భోజనం తినండి. మితిమీరిన లేదా కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు. సంగీతం వినడం వంటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉండండి. అల్లం మిఠాయి తినండి.