NTV Telugu Site icon

పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను ఎప్ప‌టినుంచి పంపాలంటే…

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స్కూళ్ల‌ను తిరిగి ఒపెన్ చేసేందుకు అనేక రాష్ట్రాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.  క‌రోనా కొన్ని రాష్ట్రాల్లో జులై 1 నుంచి తిరిగి పాఠ‌శాల‌లు ఒపెన్ కాబోతున్నాయి.  అయితే, క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గినప్ప‌టికీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వ‌ర‌కు ఉన్న వారికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ అందించ‌లేదు.  పిల్ల‌ల వ్యాక్సిన్ ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ద‌శ‌లో ఉన్న‌ది.

Read: శర్వానంద్ 30వ చిత్రానికి ఆసక్తికర టైటిల్

భార‌త్ బ‌యోటెక్ కోవాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సంబందించిన డేటా సెప్టెంబ‌ర్ వ‌ర‌కు అందుతుంద‌ని, అనుమ‌తులు పొందిన త‌రువాత వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  దేశంలో చిన్నారుల‌కు వ్యాక్సిన్ ల‌భ్య‌త‌, వ్యాక్సినేష‌న్ త‌రువాత పిల్లల‌ను స్కూళ్ల‌కు పంప‌వ‌చ్చ‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు.  దేశంలో ఫైజ‌ర్‌, జైడ‌స్ వ్యాక్సిన్లు ఆమోదం పొందితే చిన్నారుల‌కు కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు మార్గం సుగమం అవుతుంద‌ని తెలిపారు.