Site icon NTV Telugu

Gastric Problems Remedies: గ్యాస్, అసిడిటీ నివారణకు 5 హోం రెమిడీస్‌ ఇవే..

Gastric

Gastric

Gastric Problems Remedies: ప్రస్తుతం గ్యాస్, అసిడిటీ వంటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. సమయానికి తినకపోవడం, ఎక్కువగా తినడం లేదా ఒత్తిడి వల్ల, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా ఉబ్బరం, కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని మందుల ద్వారా ఈ సమస్యకు ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ మందులు ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయలేవు. కొన్ని హోమ్‌రెమిడీస్‌ పాటించి వీటికి చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Satya Kumar Yadav: 22 మంది డాక్టర్లు, న‌ర్సుల‌పై చ‌ర్యలు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం

మొదటి హోం రెమిడీ: కొత్తిమీర, సోంపు, జీలకర్ర టీ.. ఈ మూడు పదార్థాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. కడుపులో గ్యాస్‌, ఆమ్లతను తగ్గిస్తాయి. ఈ రెమిడీ ఆయుర్వేద నివారణగా పరిగణిస్తారు. ముందుగా ఒక టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ కొత్తిమీర గింజలు, 1 టీస్పూన్ సోంపు, 2 కప్పుల నీరు తీసుకోండి. తక్కువ మంట మీద 5-7 నిమిషాలు మరిగించండి. వడకట్టి భోజనం తర్వాత వేడిగా త్రాగండి.

రెండవ హోం రెమిడీ: తలనొప్పి, గొంతునొప్పి, కడుపునొప్పి వంటి అనేక సమస్యలకు అల్లం దివ్యౌషధం. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఒక గ్లాస్‌ నీటలో.. అంగుళం అల్లం, అర చెంచా సోంపు, ఒక యాలక వేసి ఐదు నిమిషాలు మరిగించండి. దీన్ని ఫిల్టర్‌ చేసి రోజుకు రెండు సార్లు తాగితే.. గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం నమిలి.. దాని రసాన్ని మింగినా మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

మూడవ హోం రెమిడీ: పబ్మెడ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఆయుర్వేదంలో వామును జీర్ణ సమస్యలను దూరం చేయడానికి ఔషదంలా వాడతారు. మీరు మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతుంటే.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగండి. వాములో గ్యాస్ట్రిక్ యాసిడ్‌, జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లు ఉన్నాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర.. వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

READ MORE: Ind vs Eng 4th Test: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డు

నాలుగవ హోం రెమిడీ: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కడుపు ఉబ్బరానికి, గ్యాస్ట్రిక్‌ సమస్యకు ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, తాగితే గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. దీన్ని రోజూ ఉదయం పూట తాగడం మంచిది.

ఐదవ రెమిడీ: నిమ్మరసం మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మరసంలోని ఎసిడిక్‌ నేచర్‌.. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది కఠినమైన ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. దీంతో, గ్యాస్ట్రక్‌ సమస్య దూరం అవుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలపండి. దీనికి చిటికెడు ఉప్పు వేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version