Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health What Diabetes Patients Should Eat On Empty Stomach

Health Tips: షుగర్ పేషెంట్స్ ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా..

Published Date :January 2, 2026 , 1:50 pm
By Shiva Ganesh
Health Tips: షుగర్ పేషెంట్స్ ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. నిజానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, టైం ప్రకారం లేని దినచర్యల కారణంగా అన్ని వయసుల వారిని ఈ డయాబెటిస్ అనేది ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు వారి ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. శీతాకాలంలో శరీర అవసరాలు మారుతాయని, అలాగే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుందని వివరిస్తున్నారు. ఇంతకీ ఈ టైంలో షుగర్ పేషెంట్స్ ఖాళీ కడుపుతో ఏం తినాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి

నిజానికి డయాబెటిస్ నియంత్రణకు ఉదయం అనేది చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినే ఆహారాలు రోజంతా చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి అంటే.. తేలికైన, పోషకమైన, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ సుభాష్ గిరి వివరిస్తున్నారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల రోజుకి మంచి ప్రారంభం కావచ్చు అని, ఇంకా నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్‌లను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని చెబుతున్నారు. మొలకెత్తిన పప్పులు, ఓట్స్ లేదా గంజి వంటి ఎంపికలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయని చెప్పారు. అలాగే లేత ఆకుపచ్చ కూరగాయల రసాలు లేదా సలాడ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, అవసరమైన పోషకాలను అందిస్తాయని వివరించారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రోజంతా శక్తిని కలిగి ఉండటానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోడానికి సహాయపడుతాయని వెల్లడించారు.

డయాబెటిక్ రోగులు ఖాళీ కడుపుతో ఇవి తినకూడదు..
షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లు ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తీసుకోకూడదని డాక్టర్ సుభాష్ గిరి చెప్పారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని తెలిపారు. స్వీట్ టీ, చక్కెర లేదా బెల్లం కలిపిన పాలు, ప్యాక్ చేసిన రసాలను ఖాళీ కడుపుతో తాగడం వల్ల హానికరం కావచ్చని వివరించారు. ఇంకా బ్రెడ్, బిస్కెట్లు, కేకులు లేదా వేయించిన ఆహారాలు శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించారు. అలాగే తీపి ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదని చెబుతున్నారు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయని, అలాగే రోజంతా చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టతరం చేస్తాయని పేర్కొన్నారు.

డయాబెటిస్‌ను నియంత్రించడానికి ఇవి ట్రై చేయండి..

ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఆహారం తినండి.

మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామం లేదా నడకను చేర్చుకోండి.

సమయానికి మందులు తీసుకోండి.

మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

తగినంత నిద్ర పొందండి, అలాగే ఒత్తిడికి దూరంగా ఉండండి.

READ ALSO: Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blood sugar control foods
  • diabetes control diet
  • diabetes empty stomach diet
  • diabetes morning food tips
  • diabetes winter care

తాజావార్తలు

  • Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..

  • SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

  • CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

  • Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? నేతల అసంతృప్తి పార్టీకి నష్టమేనా?

  • Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions