Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. నిజానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, టైం ప్రకారం లేని దినచర్యల కారణంగా అన్ని వయసుల వారిని ఈ డయాబెటిస్ అనేది ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు వారి ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. శీతాకాలంలో శరీర అవసరాలు మారుతాయని, అలాగే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుందని వివరిస్తున్నారు. ఇంతకీ ఈ టైంలో షుగర్ పేషెంట్స్ ఖాళీ కడుపుతో ఏం తినాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
నిజానికి డయాబెటిస్ నియంత్రణకు ఉదయం అనేది చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినే ఆహారాలు రోజంతా చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి అంటే.. తేలికైన, పోషకమైన, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ సుభాష్ గిరి వివరిస్తున్నారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల రోజుకి మంచి ప్రారంభం కావచ్చు అని, ఇంకా నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్‌లను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని చెబుతున్నారు. మొలకెత్తిన పప్పులు, ఓట్స్ లేదా గంజి వంటి ఎంపికలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయని చెప్పారు. అలాగే లేత ఆకుపచ్చ కూరగాయల రసాలు లేదా సలాడ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, అవసరమైన పోషకాలను అందిస్తాయని వివరించారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రోజంతా శక్తిని కలిగి ఉండటానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోడానికి సహాయపడుతాయని వెల్లడించారు.
డయాబెటిక్ రోగులు ఖాళీ కడుపుతో ఇవి తినకూడదు..
షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లు ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తీసుకోకూడదని డాక్టర్ సుభాష్ గిరి చెప్పారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని తెలిపారు. స్వీట్ టీ, చక్కెర లేదా బెల్లం కలిపిన పాలు, ప్యాక్ చేసిన రసాలను ఖాళీ కడుపుతో తాగడం వల్ల హానికరం కావచ్చని వివరించారు. ఇంకా బ్రెడ్, బిస్కెట్లు, కేకులు లేదా వేయించిన ఆహారాలు శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించారు. అలాగే తీపి ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదని చెబుతున్నారు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయని, అలాగే రోజంతా చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టతరం చేస్తాయని పేర్కొన్నారు.
డయాబెటిస్‌ను నియంత్రించడానికి ఇవి ట్రై చేయండి..
ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఆహారం తినండి.
మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామం లేదా నడకను చేర్చుకోండి.
సమయానికి మందులు తీసుకోండి.
మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తగినంత నిద్ర పొందండి, అలాగే ఒత్తిడికి దూరంగా ఉండండి.
READ ALSO: Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ
