Site icon NTV Telugu

Ear Cleaning Mistakes: మీ చెవుల్లో గులిమిని ఇలా క్లీన్ చేస్తున్నారా? జాగ్రత్త.. సేఫ్ పద్ధతులు ఇవే!

Earwax Cleaning

Earwax Cleaning

Ear Cleaning Mistakes: మీ చెవుల్లో గులిమిని ఎలా క్లీన్ చేస్తున్నారు. పొరపాటున మీ వేలు లేదా కాటన్ తో దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే వెంటనే ఈ పద్ధతులను ఆపేయండి. మీ చెవుల్లో గులిమి ఎందుకు పేరుకుపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా, దానిని తొలగించడానికి సేఫ్ పద్ధతులు ఏంటో తెలుసా. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Swiggy AI Update: స్విగ్గీ ‘ఏఐ’ ధమాకా.. యాప్ వెతికే పనిలేదు.. చెబితే చాలు పంపేస్తుంది!

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. చెవిలో పేరుకుపోయే మురికిని ఇయర్‌వాక్స్ అంటారని వెల్లడించారు. ప్రజలు తరచుగా దీనిని ధూళిగా పొరబడతారు, కానీ వాస్తవానికి ఇది చెవిలోని సహజ రక్షణ పొర అని, ఇది దుమ్ము నుంచి హానికరమైన బ్యాక్టీరియా వరకు ప్రతిదీ చెవి లోపలికి రాకుండా అడ్డుకుంటుందని తెలిపారు. అయితే ఈ ధూళి అధికంగా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.

మీ చెవులను ఎప్పుడూ ఇయర్ క్లీనర్లతో శుభ్రం చేసుకోకూడదని నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇయర్ క్లీనర్ల వైద్యులు కారని, వారు స్టెరిలైజ్ చేయని పరికరాలను కూడా ఉపయోగిస్తారని, అవి అనుకోకుండా చెవిలోకి వెళితే, అది చెవిపోటుకు, ఇన్ఫెక్షన్ లేదా చీము ఏర్పడే ప్రమాదానికి దారి తీయవచ్చని చెబుతున్నారు. కాబట్టి వీళ్ల వద్ద పొరపాటున కూడా మీ చెవులను శుభ్రం చేసుకోకండని సూచిస్తున్నారు. ఏ చెవి సమస్యకైనా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని అంటున్నారు. ENT వైద్యులు మైక్రోస్కోప్, ప్రత్యేక పరికరాలను ఉపయోగించి చెవిలో గులిమిని సురక్షితంగా తొలగిస్తారని పేర్కొన్నారు. వాస్తవానికి చెవిలో గులిమి తక్కువ మురికిగా ఉంటే, అది దానంతట అదే బయటకు వస్తుందని తెలిపారు. వేళ్లు, అగ్గిపుల్లలు చెవిలోకి పెట్టి తీయడానికి ప్రయత్నిస్తే గులిమిని మరింత లోపలికి నెట్టగలవని వివరించారు.

ఇలా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

* చెవిలో పదునైన నొప్పి

* చెవి నుండి నీరు కారడం

* అకస్మాత్తుగా వినికిడి కోల్పోవడం ప్రారంభమైనప్పుడు

* తీవ్రమైన తలనొప్పి

READ ALSO: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?

Exit mobile version