Weight Loss Tips: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అధిక బరువు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లడం ప్రారంభిస్తారు, అలాగే ఆహారంలో తీవ్రమైన మార్పులు చేస్తారు. అయితే మీరు కచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే, డైటింగ్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు మీ రోజును ఎలా ప్రారంభించాలి అనేది కూడా చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తింటే, చాలా సులభంగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు, ఫిట్‌నెస్ కోచ్‌లు చెబుతున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Trump: వెనిజులా చమురుపై ట్రంప్ చూపు.. మదురో అరెస్ట్ తర్వాత సంచలన వ్యాఖ్యలు..
ఈ 5 రోజూ తినడం ప్రారంభించండి..
నానబెట్టిన బాదం, వాల్‌నట్స్: మీరు ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం, వాల్‌నట్‌లను తినాలి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మీకు ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అలాగే మళ్లీ ఏదైనా తినాలనే కోరికలను నివారించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇంకా వీటిని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు.
చియా విత్తనాల నీరు: చియా గింజలు కలిపిన నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. చియా గింజలు తినడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, అలాగే అతిగా తినాలనే కోరిక తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉరిసి రసం: బరువు తగ్గడానికి చక్కెర కలపని ఉరిసి రసం అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ రసం తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, అలాగే ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుందని, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
పసుపు, నల్ల మిరియాలు నీరు: గోరువెచ్చని నీటిలో పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది, అలాగే వాపును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
బ్రెజిల్ గింజలు: బ్రెజిల్ గింజల్లో సెలీనియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి, అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి. దీనివల్ల బరువు నియంత్రణ సులభం అవుతుంది. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది.
READ ALSO: Mangli : కాపీ కొట్టి అడ్డంగా దొరికిన సింగర్ మంగ్లీ.. అసలు నిజమిదే!
