NTV Telugu Site icon

Health Tips : చలికాలంలో రోజూ పరగడుపునే వీటిని తినాలి.. ఎందుకో తెలుసా?

Winter Season

Winter Season

చలికాలం మొదలువ్వక ముందే చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇక చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు.. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. అందుకే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని చలికాలంలో మనం తప్పకుండా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరం బలంగా, శక్తివంతంగా తయారవుతుంది.. ఈ కాలంలో ఎక్కువగా ఖర్జురాలను తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకంతో బాధపడే వారు రోజూ రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది.. బరువు తగ్గుతారు.. ఇక కంటి ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి..

ఇకపోతే వీటిని తీసుకోవడం వల్ల తగినంత శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడే వారు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.. ఇన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కాబట్టే రోజుకు రెండు చొప్పున పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.