అల్లం ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. అందుకే అల్లం ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు..అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా కూరల్లో వాడతాం. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. వీటిలో కొన్నింటితో టీ, కాఫీలు చేసుకుని తాగితే చాలా వరకూ జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.. అల్లంను టీ చేసుకొని తాగడం వల్ల జలుబు దగ్గు వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. అల్లం టీని ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా అల్లంని తీసుకొని బాగా కడిగి శుభ్రం చెయ్యాలి.. ఆ తర్వాత పీల్ చేసి తురుముగా చేసి పెట్టుకోవాలి. ఓ గ్లాసు నీటిని వేడి చేసి అందులో అల్లం తురుము వేసి కనీసం 5 నిమిషాలపైనే మరిగించాలి. దీనిని గోరువెచ్చగా అయ్యాక వడపోయాలి.. మీరు ఈ టీని అలానే తాగొచ్చు. లేదా ఇందులో తేనె కలిపితే దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. నిమ్మరసం కలిపితే ఎక్స్‌ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది.. అది మీ ఇష్టం..
ఇకపోతే జలుబు తగ్గేందుకు చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా, వేసుకోపోయినా అంత త్వరగా తగ్గదు. కాబట్టి, కొన్ని ఇంటిచిట్కాలు హెల్ప్ చేస్తాయి. ఆవిరిపట్టడం, మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. దీని వల్ల ముక్కుదిబ్బడ చాలా త్వరగా తగ్గుతుంది. వీటితో పాటు బయటికి వెళ్ళినప్పుడు చల్లని గాలి లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తపడాలి… ఇలా చేస్తే జలుబు త్వరగా తగ్గుతుంది.. ఒక్క జలుబు మాత్రమే కాదు ఎన్నో రోగాలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.