NTV Telugu Site icon

Health Tips: సులువుగా బరువు తగ్గాలా ? అయితే ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Weight Loss

Weight Loss

బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. అయితే చాలా మందికి నడక కూడా వ్యాయామం లాంటిదే అని చాలా అరుదుగా తెలుసు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటిస్తే చాలు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో 150 క్యాలరీస్ ను తగ్గించుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు వాక్ చేస్తూ బరువును కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నెల రోజుల వాకింగ్ ప్లాన్..

బరువు తగ్గాలనుకొనే వారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేస్తే సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అలాంటి వారి కోసం నెల రోజుల పాటు వాకింగ్ ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం.

Day 1: 20 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ చేయాలి తర్వాత 15 నిమిషాలపాటు ఒక మోస్తరు వేగంతో వాకింగ్ చేయాలి.మళ్లీ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి.

Day 2: పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. తరువాత 20 నిమిషాలు మోస్తారు వేగవంతమైన వాకింగ్ అలాగే 5 నిమిషాలు నెమ్మది వాకింగ్.

Day 3: మరుసటి రోజున విశ్రాంతి తీసుకోవాలి.

Day 4: 20 నిమిషాల పాటు నెమ్మదిగా నడక చేయాలి. తర్వాత 15 నిమిషాలు మోస్తారు వాకింగ్ తర్వాత 5 నిమిషాలు నెమ్మది నడవాలి.

Day 5: 10 నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ 20 నిమిషాలు మోస్తారు వాకింగ్ 20 నిమిషాల వేగవంతమైన వాకింగ్ చేయాలి.

Day 6: 5 నిమిషాలు నెమ్మదిగా నడక 5 నిమిషాలు మోస్తారు వాకింగ్ 25 నిమిషాలు వేగమైన వాకింగ్ తరువాత ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్.

Day 7: విశ్రాంతి తీసుకోవాలి.

ఇలాగే రెండో వారంలో కూడా మీ సామర్ధ్యానికి తగ్గట్టు సమయాన్ని పెంచుకొని క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది.