NTV Telugu Site icon

Health Tips : రోజూ సాయంత్రం వీటిని తింటే మీ ఆయుష్షు పెరుగుతుంది..

Protine Food

Protine Food

ఈరోజుల్లో సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు.. అందుకే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. ముఖ్యం గుండె సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. జంక్ ఫుడ్ ను తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కొందరు గుండె సమస్యల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. కొన్ని ఆహారాలను సాయంత్రం తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రాదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

అధిక కొవ్వులు కలగిన వాటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. మాంసం లో కొవ్వును పెంచుతుంది.. అందుకే మాంసాహారానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి. పల్లీలు, రాజ్మా, సోయాచిక్కుళ్లు వంటి ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. జన్మలో గుండె సమస్యలు రావు..

ఇకపోతే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి చాలా మంది అన్నాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. అయితే అన్నానికి బదులుగా అంతే శక్తిని ఇచ్చే ఇతర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ విధంగా అన్నానికి బదులుగా ప్రోటీన్ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.. ఇక ఎప్పటికి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.. తగినంత నీరు తీసుకోవాలి.. టైం కు తింటే ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.