అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది..అందులో బెల్లీ ఫ్యాట్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనిషి సన్నగా ఉన్న పొట్ట ఎక్కువగా కనిపించడంతో చూడటానికి చెండాలంగా ఉంటుంది.. దాంతో జిమ్ లని డాక్టర్స్ దగ్గరకో పరుగేడతారు.. అలా కష్టపడాల్సిన పనిలేదు.. రోజుకు కేవలం పది నిమిషాలు ఇలా చేస్తే ఇక బెల్లీ ఫ్యాట్ సమస్య వెంటనే తగ్గుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన పనిలేదు.. కేవలం పది నిముషాలు కొన్ని వర్కౌట్స్ చెయ్యాలి.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్లాంక్స్..మీ పాదాలను హిప్ వెడల్పుగా ఉంచండి. ఓ కాలుని ముందుకి వంచండి. వెనుక కాలిని 3 అంగుళాల దూరంలో ఉంచండి. ఫొటోలో చూపినట్లుగా ఉండి.. డంబెల్స్‌ని పట్టుకోండి. ఇలా కాలు మార్చి చేయండి. 10 సార్లు మూడు సెట్లు చేయండి.నేలపై బోర్లా పడుకుండి ఇప్పుడు ముంజేతులని ప్లాంక్ పొజిషన్‌లో పెట్టండి. మోచేతులు సమానంగా ఉండేలా చూసుకోండి. మీకు వీలైనంతగా ప్లాంక్ పొజిషన్‌లో ఉండండి.. ఇది మీకు ఎంత వీలైతే అంతవరకు చెయ్యడం మంచిది..
బైసైకిల్ క్రంచెస్..ఇది పేరులోనే ఉంది..ముందుగా ఓ చాప మీద పడుకోవాలి. మీ తల వెనుక చేతులు ఉంచండి. మీ మోకాలిని ఛాతి పైకి తీసుకురండి. మోకాలిని ఎదురుగా ఉన్న మోచేయితో కలిసేలా అప్పర్ బాడీని తిప్పండి.. కాళ్ళతో సైకిల్ తొక్కినట్లు తొక్కండి.. అంతే ఇలా ఒక్కొక్కటి 10 సార్లు చెయ్యండి..
బర్డ్ డాగ్..భుజాలను మణికట్టు మీదుగా, మోకాళ్ళపై తుంటితో ప్రారంభించండి. మీ కుడి చేయి, ఎడమ కాలుని ఒకేసారి పైకి లేపండి. మీ కోర్‌ని బలంగా ఉంచండి మీ పాదాన్ని వెనక్కి తన్నండి. మీ అరచేతిని శరీరం వైపు ఎదురుగా ఉండేలా చూసుకోండి. కొన్ని సెకన్ల పాటు అలానే ఉంచి మోచేయి, మోకాలిని శరీరం కిందికి తాకేలా తీసుకురండి… ఇలా చెయ్యి మార్చి ఇలా చెయ్యాలి.. రోజుకు 10 సార్లు చేస్తే సరి.. ఇలాంటివి రోజు క్రమం తప్పకుండ చేస్తే బెల్లీ ఫ్యాట్ వెంటనే తగ్గుతుంది
