NTV Telugu Site icon

Health Tips: మీ ఎముకలు బలంగా ఉండాలా ? అయితే ఇవి తినండి..

Bokka

Bokka

మన ఎముకలు బలంగా ఉంటేనే మనం కూడా గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా కట్లు కట్టించుకోవాల్సిందే. మనం తినే పదార్థాలు వల్ల ఎముకలకు సరైన పోషకాలు అందించవచ్చు. అయితే ఆ సంగతేంటో చూసేద్దామా …

1. పాలు: పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి.

2. ఆరెంజ్: నారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్..శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

3. బాదం : బాదం పప్పులు తింటే ఎన్నో లాభాలు. ఓ కప్పు వేపిన బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది బోన్లకు బలమే కాదు… బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది.

4. పెరుగు : పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి పాల రుచి నచ్చదు. వారు పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు.

5. స్వీట్లు : పాలతో తయారుచేసే స్వీట్లు , జున్ను ఇతర పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.