NTV Telugu Site icon

Health Tips : పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Vellulli

Vellulli

మానవ శరీరానికి విటమిన్ డి చాలా అవసరం.. కణాల తయారీలో, బైల్ జ్యూస్ తయారీలో, హార్మోన్ల ఉత్పత్తిలో, విటమిన్ డి తయారీలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరమవుతుంది.. మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ ను మన శరీరమే అందిస్తుంది.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరుగుతుంది.. దాంతో అధిక బరువు పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

మాములుగా మన శరీరానికి రోజుకు 300 గ్రా కొలెస్ట్రాల్ మాత్రమే అవసరమవుతుంది. చాలా మంది శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటూ ఉంటారు. వంటల్లో కూడా వెల్లుల్లిని వాడుతూ ఉంటారు.. దీన్ని రోజు పరగడుపున తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తంలో పెరుగుతాయి.. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్పాలెనొనిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో దోహదపడుతుంది. ఇది నిజమే అయినప్పటికి చాలా మందిలో వెల్లుల్లిని తీసుకున్నప్పటికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటున్నాయి.. వీటిని రోజు తీసుకోవడంతో పాటు అధిక కొవ్వు కలిగిన ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే మనం మన ఆహార నియమాలను మార్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జంతు సంబంధిత ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించడంలో దోహదపడుతుంది.. అందుకే వెల్లుల్లిని తీసుకొనేవారు ప్రతి రోజు మంచి డైట్ ను కూడా ఫాలో అవ్వాలి.. అప్పుడే శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది.. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.