ఈ మధ్య గ్రీన్ టీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. బరువు తగ్గడంలో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు..అందుకే చాలా మంది ఈ టీని తాగుతున్నారు..గ్రీన్ టీ ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గ్రీన్ టీ మనకు షాపుల్లో, సూపర్ మార్కెట్ లలో లభిస్తుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో దోహదపడతాయి. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఉదయాన్నే గ్రీన్ టీ ని తాగడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి ఆరోగ్యవంతంగా బరువు తగ్గేలా చేయడంలో గ్రీన్ టీ మనకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారు ఒక కప్పు గ్రీన్ టీ ని తాగితే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి..
ఇకపోతే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మెదడు చక్కగా పని చేస్తుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు మేలు కలిగినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాల బారిన కూడా పడే అవకాశం ఉంది. అందుకే రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ టీని తాగాలి.. అప్పుడే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలమని నిపుణులు చెబుతున్నారు… సో మీరుకూడా అలవాటు చేసుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.