NTV Telugu Site icon

Health Tips: రాత్రి పొరపాటున కూడా వీటిని తినకండి.. ఎందుకో తెలుసా?

Jank Food

Jank Food

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర.. ఈ రెండు లేకుంటే మాత్రం మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. మన జీవితం మొత్తం తల క్రిందులు అవుతుంది.. అందుకే అంటారు పెద్దలు కోటి విద్యలు కూటి కొరకే అని.. రాత్రి భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండకుంటే మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పూట ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం అసలు మంచిది కాదు.. జంక్ ఫుడ్, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని రాత్రి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటుగా, అధిక బరువు కూడా పెరిగిపోతారు.. చీజ్ బర్గర్లు అస్సలు తినకూడదు. రాత్రిపూట చీజ్ జీర్ణం కాదు. అంతేకాకుండా ఇది చాలా త్వరగా బరువును పెంచుతుంది. అందుకే వీటి జోలికి ఎట్టి పరిస్థితి లోను వెళ్ళకూడదు..

పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఇది తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. నిద్రకు భంగం కలుగుతుంది.. అందుకే పండ్లు ఏవి తినక పోవడం మంచిది.. అలాగే చాలా మందికి పడుకొనే ముందు టీ, కాఫీ అసలు తాగవద్దని నిపుణులు చెబుతున్నారు.. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఫలితంగా రాత్రిపూట కాఫీ తాగితే నిద్రపట్టదు. తగినంత నిద్ర లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది.. అందుకే ఈ టీ, కాఫీ లను తాగక పోవడమే మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.