NTV Telugu Site icon

Health Tips : టీవీ చూస్తూ తింటున్నారా? ఒక్కసారి ఇది చూస్తే జన్మలో తినరు..

Tv Eating

Tv Eating

చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది.. భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ తింటారు.. లేదా ఫోన్ పట్టుకొని తింటారు.. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయిన కూడా అదే చేస్తారు.. పిల్లలకు కూడా ఈ అలవాటు ఉంటే వారి శరీరంలో కూడా దాని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.. టీవీ చూస్తూ భోజనం చేసే 10 ఏళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.. ఇవే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

భోజనం చేసేటప్పుడు టీవీలు, మొబైల్ ఫోన్లు చూడటం అలవాటు. ఈ కారణంగా వారు తరువాత అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలా చేయకపోతే ఊబకాయం, పొట్ట సమస్యలు, కళ్లు బలహీనం వంటి సమస్యలు రావచ్చు. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూడటం వల్ల కలిగే ప్రభావాను తీసుకోవడం మంచిది..

ఇలాంటి తినడం వల్ల నమలకుండా త్వరగా తినేస్తారు.. దాంతో ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు..అజీర్ణం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే కడుపు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.. ఇక రాత్రి సమయంలో ఇలా భోజనం చెయ్యడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. వాస్తవానికి టీవీ చూస్తున్నప్పుడు పరిమితికి మించి తింటారు. దీని కారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో సమస్య రాత్రంతా కొనసాగుతుంది.. దాంతో నిద్ర పోవడానికి సమయం పడుతుంది.. అందుకే తిన్న తర్వాత టీవీ చూడటం మంచిది.. ఈ విషయాలను గుర్తుపెట్టుకొన్ని ఆహారాన్ని తీసుకోవడం మేలు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.