Health Tips : అల్లంతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లం మసాలా వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇప్పుడు వద్దన్నా అనేక రోగాలు వస్తుంటాయి.. అయితే అల్లంను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి అల్లంను ఎలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. జీర్ణ సమస్యలు ఎలాంటివైనా సరే.. అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కాస్తంత అల్లం రసం సేవిస్తుంటే అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. అలాగే వికారం, వాంతులు కూడా తగ్గుతాయి.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
*. దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లంను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దంతాలను తోముకోవాలి. దీంతో చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
*. సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించేందుకు కూడా అల్లం పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి..
*. మహిళలు నెలసరి సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి.
*. క్యాన్సర్ రాకుండా చూసే గుణాలు అల్లంలో ఉన్నాయి. కనుక అల్లంను రోజూ తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
*. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి అల్లం మేలు చేస్తుంది. రోజు అల్లం కషాయం తాగుతున్నా లేదా అల్లం రసాన్ని పరగడుపునే తీసుకుంటున్నా.. ఆయా సమస్యలు తగ్గుతాయి.
*. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. కనుక అల్లం రసాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో పరగడుపునే సేవించాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు మొత్తం బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.. బయట దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు రాకుండా అల్లం టీ తీసుకోవడం మంచిది..
*.అల్లం రక్తాన్ని పలుచన చేసి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు అల్లంకు ఉన్నాయి. అల్లంను రోజూ తీసుకుంటే రక్త సరఫరా మెరుగు పడి హైబీపీ తగ్గుతుంది.ఒంట్లో నొప్పులు తగ్గుతాయి.
*. అల్లంను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
*. అధిక బరువును తగ్గించడంలో.. కొవ్వును కరిగించడంలో అల్లం సహాయపడుతుంది. పరగడుపునే అల్లం రసం సేవిస్తుంటే.. మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. ఇలా అల్లంతో మనం అనేక లాభాలను పొందవచ్చు… ఘాటైన ఈ అల్లంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!