Site icon NTV Telugu

పండ్లు, పాలు స్టీల్ పాత్రలో నిల్వ చేయడంతో ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా..

Untitled Design (5)

Untitled Design (5)

సాధారణంగా చాలా ఇళ్లలో స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువకాలం మన్నడం, శుభ్రంగా ఉండడం వల్ల మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వంట చేయడానికి, నీరు నిల్వ చేయడానికి స్టీల్ పాత్రలు మంచివైనప్పటికీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యేకంగా పండ్లు, పాల ఉత్పత్తులు వాటిలో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచినప్పుడు రసాయన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, బెర్రీలు వంటి సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. ఈ పండ్లను స్టీల్ పాత్రల్లో ఎక్కువసేపు ఉంచితే, అందులోని ఆమ్లం స్టీల్‌లో ఉండే నికెల్, క్రోమియం వంటి లోహాలతో చర్య జరపవచ్చు. దీని వల్ల ఆ లోహపు తత్వాలు స్వల్పంగా ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. ఇవి దీర్ఘకాలంగా తీసుకుంటూ ఉంటే అజీర్తి, వికారం, అలెర్జీలు వంటి సమస్యలు రావచ్చు. అంతేకాక, ఆహారం సహజ రుచి మారి లోహపు రుచి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

అలాగే, పెరుగు, మజ్జిగ, పాలు వంటి పాల ఉత్పత్తులు ఆమ్లత్వం కలిగి చాలా సున్నితమైనవి. స్టీల్ పాత్రల్లో వీటిని నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పులిసిపోవడం లేదా పాడైపోవడం సాధారణం. పాల ఉత్పత్తులు కూడా స్టీల్‌తో చర్య జరపడంతో రుచి మారే అవకాశం ఉంది.

గాజు పాత్రలు ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాకుండా ఆమ్ల ఆహారాలు, పాల ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని నిఫుణులు చెబుతున్నారు. సిరామిక్ కంటైనర్లలో పండ్లు, వండిన ఆహారం, ఇతర పదార్థాలను నిల్వ చేసేందుకు ఉపయోగించువచ్చంటున్నారు. అయితే.. అత్యవసర పరిస్థితుల్లో బీపీఏ-రహిత ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ ఉపయోగించవచ్చన్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిఫుణులకు కలవడం ఉత్తమం.

Exit mobile version