ప్రస్తుత కాలంలో ఏ ఫుడ్ తినాలన్న బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ హోటల్లో తినాలన్నా అందులో ఏం కలుస్తుందోన్న ఆందోళన, భయం ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జంక్ ఫుడ్ కాకుండా.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే…రోగాలు రావో.. వాటిని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలని నిఫుణులు చెబుతున్నారు. చలికాలంలో పల్లీలు తినడం చాలా మంచిదంటున్నారు.
Read Also:Realme GT8 Pro: మార్కెట్ లోకి రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా..
అయితే.. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివని.. చలికాలంలో పల్లీలు తినడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశనగలు తినడంతో శరీరానికి కావాల్సిన ఫైబర్, మినరల్స్ అందుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందంటున్నారు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, గ్యాస్, మలబద్ధక సమస్యలు తొలగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. పల్లీలు తినడం వల్ల కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు మన శరీరానికి అందుతాయని చెబుతున్నారు. షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయన్నారు… పల్లీలను పేదవాడి బాదంపప్పు అని కూడా పిలుస్తారు. ఇకనైనా రోజుకు గుప్పెడు పల్లీలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు న్యూటిషియన్స్.. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం.. కాబట్టి మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు.. డాక్టర్ ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
