సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో జామ పండ్లు తినడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Read Also: Flipkart: జీరో కమిషన్ మోడల్ అందిస్తున్నట్టు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
అయితే జామపండ్లలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి6, ఫోలేట్ ఉంటాయి. పైగా జామ పండ్లు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి. చలికాలంలో వీడిని ఎక్కవగా తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. జామ పండ్లను తీసుకోవడంతో జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు.
Read Also:Diabetes Eye Symptoms: ఈ తీవ్రమైన వ్యాధి లక్షణాలు మీ కళ్లలో కనిపిస్తున్నాయా?
జామ పండ్లలో ఉండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇవి బ్లెడ్ ప్రెషర్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కూడా ఎంతో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారు వీటిన తినడంతో చక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగు పరచడం.. మల బద్దకం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేగులను శుభ్ర పరచడంలో జామ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది కేవలం ఇంటర్నెట్ నుంచి గ్రహించాము.. కాబట్టి మీరు దీన్ని ఫాలో అయ్యే ముందు వైద్యులను కానీ… హెల్త్ ఎక్సపర్ట్స్ ని సంప్రదించి సలహా తీసుకోండి.
