NTV Telugu Site icon

Health : వీకెండ్ కదా అని చికెన్ ను కుమ్మేస్తున్నారా?.. ఇది వింటే జన్మలో తినరు..

Happy,asian,man,eating,bbq,chicken,wings,in,restaurant.

Happy,asian,man,eating,bbq,chicken,wings,in,restaurant.

నాన్ వెజ్ అంటే గుర్తుకు వచ్చేది చికెనే.. రుచిగా ఉండటంతో పాటు అందరికి అందుబాటులో ఉంటుంది.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోట్టలేసుకుంటూ తింటారు.. ఇంకొందరు రకరకాల వెరైటీలను చేసుకొని మరీ తింటారు.. కొంతమంది చికెన్ లేకుండా ముద్ద కూడా ఎత్తరంటే అతిశయోక్తి కాదు. అంతలా చికెన్‌కి బానిసలుగా మారిపోతున్నారు కొందరు.. అది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

ఈ చికెన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అత్యంత భయంకరమైన యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అనే వ్యాధి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.. ఏఏంఆర్ అనేది ప్రపంచంలో పదవ అతిపెద్ద వ్యాధిగా జాబితాలోకి ఎక్కింది.. చికెన్ ను తినడం వల్ల ప్రజలు అత్యంత వేగంగా ఏఎంఆర్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు..చికెన్‌లో ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ డాక్టర్లు అంటున్నారు..

ప్రస్తుత రోజుల్లో చికెన్‌ను ఆరోగ్యంగా, తాజాగా ఉంచడానికి యాంటీబయాటిక్స్‌ను పౌల్ట్రీలలో ఇస్తున్నారు. దీని కారణంగా కోడి శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకుపోతుంది. ఇది చికెన్ తినేవారి శరీరంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. ఈ కోడిని తిన్నప్పుడు, చికెన్‌లోని యాంటీబయాటిక్ తినేవారి శరీరంలో పోగుపడుతుంది.. అది కాస్త ఆ వ్యాధిగా మారుతుందట..అందుకే ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే భోజనంలో శాఖాహారాన్ని తీసుకోవడం పెంచాలి. ఆకుపచ్చ కూరగాయలు, పనీర్, పాలు, పెరుగు ఉపయోగించాలి… గుర్తుంచుంకోండి.. రుచి కోసం ప్రాణానలను తీసుకోరు కదా.