73 Year Old Man Fitness: ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. నిజానికి అన్ని వయసుల వారు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 30 – 40 ఏళ్ల వయస్సు వారే ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపలేకపోతున్న సందర్భంలో 60 – 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు జిమ్‌కు వెళ్లి ఫిట్‌నెస్‌పై దృష్టిపెడతారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ ఒక 70 ఏళ్ల తాత ఫిట్‌నెస్‌ను చూస్తే కుర్రహీరోలు కూడా కుళ్లుకోవాల్సిందే. ఆయన ‘సిక్స్ ప్యాక్’ను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
70 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్..
నిజానికి ఈ తాత పేరు మార్క్. ప్రస్తుతం ఆయన వీడియో ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆయన తన ఫిట్‌నెస్ రహస్యాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలా మంది నన్ను టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT) తీసుకుంటున్నారని అనుకుంటారు, కానీ కాదు, నేను నా దినచర్యను అనుసరిస్తున్నాను” అని చెప్పాడు. “ప్రతి రోజు నేను 100 పుష్-అప్‌లు, 100 పుల్-అప్‌లు చేస్తాను. ఇది నా అతిపెద్ద ఫిట్‌నెస్ రహస్యం” అని ఆయన వెల్లడించారు. ఈ వీడియోలో తన వయసు గురించి మార్క్ వివరిస్తూ “నాకు 73 ఏళ్లు వస్తాయి. నా ఫిట్‌నెస్‌కు నేను తీసుకునే ఆహారం అతిపెద్ద ప్లెస్ పాయింట్. నేను చాలా తక్కువ కార్బోహైడ్రేట్‌లను తీసుకుంటాను” అని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
READ ALSO: Feeling Sleepy: భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తోందా? సైన్స్ చెబుతున్న 5 షాకింగ్ నిజాలు ఇవే!
