Site icon NTV Telugu

Hair Fall Reasons: మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా! ఎందుకో తెలుసుకోండి..

Hair Fall

Hair Fall

Hair Fall Reasons: ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య చాలా మందిని వేధిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అసలు జట్టు విపరీతంగా రాలిపోడానికి కారణాలు ఏంటి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: నభా నటేష్ అందాలతో చెమటలు పట్టిస్తోందే!

జుట్టు విపరీతంగా రాలడానికి ఇనుము, జింక్, విటమిన్ డి లోపాలు ఎక్కువగా కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. జుట్టు ఊరికే రాలిపోదని.. వాస్తవానికి ఈ సమస్య ఎదురు కావడానికి ముందు అనేక దశలు పడుతుందని చెబుతున్నారు. చాలా మంది జట్టు రాలడానికి ముందు కనిపించే సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. బలహీనమైన, పెళుసైన జుట్టుకు ప్రధాన కారణాలలో జింక్ లోపం ముందు ఉంటుందని చెబుతున్నారు. జుట్టుకు ప్రోటీన్ అయిన కెరాటిన్ అనేది ఎక్కువగా జింక్‌పై ఆధారపడుతుందని చెబుతున్నారు. శరీరంలో జింక్ సరిపడా లేకపోతే, మీ జుట్టు కూడా “ఇటుకలు లేని భవనం” లాగా బలాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. నిజానికి మహిళల్లో ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తుందని చెబుతున్నారు. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం అని, ఇది జుట్టు కుదుళ్లతో సహా శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేస్తుందని చెబుతున్నారు. జట్టు రాలడాన్ని తగ్గించడానికి గుడ్లు, జనపనార గింజలు, గుమ్మడికాయ గింజలు వంటి జింక్ అధికంగా ఉండేవి మీ రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

జుట్టు రాలడానికి విటమిన్ డి లోపం కూడా మరొక ప్రధాన కారణంగా చెబుతున్నారు. విటమిన్ డి యాంటీమైక్రోబయల్ పెప్టైడ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, ఇది నెత్తిని మంట, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల నెత్తిలో దురద, చుండ్రు, చికాకు, జట్టు అధికంగా రాలిపోవడం జరుగుతుందని వెల్లడించారు. విటమిన్ డి లోపం చాలా సాధారణం కాబట్టి, ఈ సమస్యను అధిగమించడానికి సూర్యరశ్మిలో ఉండాలని, పలు సందర్భాల్లో వైద్యుడి పర్యవేక్షణలో సప్లిమెంట్లను కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. జట్టు రాలడాన్ని తగ్గించడానికి పాలకూర, గార్డెన్ క్రెస్ విత్తనాలు, మునగ ఆకులు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

READ ALSO: Zodiac Predictions 2026: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో దరిద్రం దండిగా ఉంటుందట!

Exit mobile version