ఇటీవల కాలంలో ప్రపంచ లగ్జరీ లిప్‌స్టిక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఈ మార్కెట్ మొత్తం విలువ $3.91 బిలియన్లు కాగా, 2030 నాటికి ఇది $5.58 బిలియన్ల వరకు చేరుతుందని అంచనా. మీకు తెలుసా! ఒక లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు ఉందని. కానీ ఇది నిజం H. Couture Beauty Diamond లిప్‌స్టిక్ ధర రూ.119 కోట్లు. దీని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం.
ఈ లిప్‌స్టిక్ ప్రత్యేకతలు..
2006లో తైషా స్మిత్ వాలెస్ అనే వ్యక్తి H. Couture Beauty అనే లగ్జరీ మేకప్ బ్రాండ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆరంభం నుంచే మార్కెట్‌లో తనదైన ముద్రను వేసుకుంది. విలాసవంతమైన మేకప్ ఉత్పత్తుల రూపకల్పనలో, అత్యున్నత నాణ్యత గల పదార్థాలు, ప్రత్యేకమైన డిజైన్లు, ప్రీమియం ప్యాకేజింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా H. Couture Beauty బ్రాండ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.
లైఫ్ టైమ్ రీఫిల్ సౌకర్యం..
ఈ లిప్‌స్టిక్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే దీనిని ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత జీవితాంతం ఉచిత రీఫిల్ సౌకర్యం లభిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా ఈ లిప్‌స్టిక్ కొనుగోలు చేస్తే
అది అయిపోయిన తర్వాత మళ్లీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా వాళ్లే ఉచితంగా రీఫిల్ సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ అదనంగా కొనుగోలు చేసిన కస్టమర్‌కు ప్రత్యేకమైన బ్యూటీ సర్వీస్ కూడా ఉచితంగా అందజేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లిప్‌స్టిక్ ధర ఆకాశానికి చేరడానికి కారణం దాని రంగు లేదా ఫార్ములా కాదు, దాని ప్యాకేజింగ్ కేసు. 18 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ఈ కేసుపై 1,200 పింక్ వజ్రాలు పొదిగబడ్డాయి. ఇది కస్టమర్ ఆర్డర్‌కు అనుగుణంగా ప్రత్యేక డిజైన్‌లో తయారు చేయబడుతుంది. దీని కారణంగానే ఆ లిప్‌స్టిక్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఇది కేవలం ఒక లిప్‌స్టిక్ కాకుండా, జీవితాంతం మెరిసే విలాసవంతమైన వారసత్వ వస్తువుగా కొనుగోలుదారుల జీవితంలో మారుతుంది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జీవితాంతం ఉచిత రీఫిల్ సౌకర్యంతో పాటు, 24×7 ఫోన్ సపోర్ట్ కూడా అందించడం
