Site icon NTV Telugu

Green Chilli Effects : పచ్చిమిర్చిని ఎక్కువగా తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Green Chilli

Green Chilli

పచ్చిమిరపకాయల పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. కళ్ల ముందుకు మిర్చి కనిపిస్తుంది.. పచ్చిమిర్చిని మనం విరివిగా వాడుతూ ఉంటాము. వంటల్లో పచ్చిమిర్చిని వేయడం వల్ల వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.. అలాగే పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.. ఎంత మేలు చేసినా కూడా అతిగా తీసుకుంటే అనర్థాలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి పచ్చి మిర్చీని ఎక్కువగా తీసుకొంటే వచ్చే ప్రమాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమ్మేళనం కారణంగా ప్రేగుల్లలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలగే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. పొట్టలో ఫోలిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. మానసికపరమైన సమస్యలు తలెత్తుతాయి.. అంతేకాదు.. ఒత్తిడికి కూడా పెరుగుతుంది..

ఇకపోతే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట కూడా వస్తుంది.. కడుపులో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే విరోచనాల సమస్య బారిన పడే అవకాశం కూడా ఉంది. అలాగే టిబి సమస్యతో బాధపడే వారు పచ్చిమిర్చికి దూరంగా ఉండాలి.. ఇలా తీసుకుంటే సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది..మన ఆరోగ్యానికి పచ్చిమిర్చి మేలు చేసేదే అయినప్పటికి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మనం వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది… ఏదైనా కూడా లిమిట్ గా తీసుకోవడం మంచిది.. లేకుంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p

Exit mobile version