Site icon NTV Telugu

Summer Tips : వేసవికాలంలో బయటకు వెళ్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

Summerr

Summerr

వేసవి కాలం మొదలైంది.. ఉదయం లేస్తూనే సూర్యుడు ప్రతాపానికి గురవుతున్నారు.. ఉదయం 9 గంటలకే ఎండ వేడి బాగా ఎక్కువగా ఉంటుంది.. మిట్ట మధ్యాహ్నం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు.. కొందరు కాయ కష్టం చేసుకొనే వాళ్లకు ఎండలు ఉన్నా కూడా తప్పదు.. బయటకు రావాల్సిందే.. భగ్గుమంటున్న భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వేసవికాలంలో అనవసరంగా బయటకు వెళ్లకపోవడమే మంచిది.. తప్పనిసరిగా రావాల్సినప్పుడు కొన్ని టిప్స్ పాటించడం మంచిది.. అవేంటో ఒకసారి చూద్దాం..

ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ తీసుకోవాలంటున్నారు. అలాగే, తల, చెవులను పూర్తి తెల్లని మెత్తని క్లాత్‌తో కప్పుకోవాలి.. మీతో తప్పనిసరిగా వాటర్ బాటిల్ ను పెట్టుకోవడం మంచిది.. ఈ నీళ్లలో కాస్త సాల్ట్‌, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. ఏసీ నుంచి డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్లవద్దు. అలాగే ఎండలో తిరిగివచ్చి డైరెక్ట్‌గా ఎసి గదికి వెళ్లవద్దు. వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు. నీళ్లను ఎక్కువగా తాగాలి.. మాములుగా మూడు లీటర్లు తాగితే ఇప్పుడు 5 లీటర్లు తాగాడం మంచిది.

నీరు ఎక్కువగా ఉండే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ తీసుకోవాలి. వేడి తగ్గుతుందని కూల్‌డ్రింగ్స్‌ తాగకూడదు. కొబ్బరి బోండాం, మజ్జిగ తాగండి. వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది.. కీర దోసకాయ, పుచ్చకాయ ముక్కలు తీసుకుంటూ ఉండాలి.. వేడి నుంచి తట్టుకోనేందుకు సహాయపడతాయి.. ఎప్పటికప్పుడు గాలి వచ్చే ప్రదేశాల్లో కూర్చోవాలి.. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానేయటం మంచిది… వీలైనంత వరకు మజ్జిగను తాగడం మంచిది.. వేడి వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.. ఇవన్నీ వేసవిలో ఫాలో అయితే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version