Site icon NTV Telugu

Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..! అయితే ఇది మీకోమే

Fridge Cleaning

Fridge Cleaning

Fridge Cleaning Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్ అయిపోయింది. తీరిక లేని, ఉరుకులుపరుగుల జీవితంలో కూరగాయలు ఏరోజువి ఆ రోజుకొనలేక ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. వాటిని తాజాగా ఉంచుకోవడానికి, అలాగే మిగిలిన కూరలను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌ను వినియోగిస్తున్నాం. ఇవన్ని సరేగాని ఫ్రిజ్ శుభ్రత గురించి పట్టించుకుంటున్నారా. ఒకవేళ పట్టించుకోకపోతే అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు నిపుణులు. అసలు ఫ్రిజ్‌ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం..

H. Couture Diamond Lipstick: లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు..! ఎందుకంటే

ఈ విధంగా శుభ్రం చేయాలి..
ఫ్రిజ్‌​ను శుభ్రం చేయడానికి నిపుణులు ఈ మార్గాలను సూచించారు. ఫ్రిజ్‌​ను శుభ్రం చేయడానికి ముందు దానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ఆ తర్వాత అందులో నుంచి అన్ని ఆహార పదార్థాలను తొలగించాలి. ఫ్రిజ్​ డోర్‌​పై ఉన్న రబ్బరు సీల్స్‌​ను వెచ్చని నీటితో, సబ్బుతో శుభ్రం చేయాలి. ఫ్రిజ్​ లోపల దుర్గంధాన్ని తొలగించడానికి, ఒక ఓపెన్ బాక్స్ బేకింగ్ సోడాను ఉంచాలి. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫ్రిజ్‌​ను శుభ్రం చేయాలని, డీఫ్రాస్ట్ చేయాలని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సిఫార్సు చేస్తోంది. వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యమంటున్నారు. తేమ అధికంగా ఉండే వర్షాకాలంలో ఫ్రిజ్​లో ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. రెగ్యులర్ డిఫ్రాస్టింగ్, శుభ్రత దీనిని నివారిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఆహార అవశేషాలు, ధూళి, ఫంగస్​లను తొలగించడానికి వెనిగర్ లేదా బేకింగ్ సోడా ఉపయోగించి షెల్ఫ్​‌లు, డ్రాయర్లను కడగాలని తెలిపారు.

Mohammed Siraj: మనతో పెట్టుకుంటే కథ వేరుంటది.. సిరాజ్ సునామి.. ఇంగ్లండ్‌ని చుట్టేసిన స్పెల్!

శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా!
ఫ్రిజ్‌​ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్​ పెరుగుతాయని సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా.ఎంవీ రావు అంటున్నారు. సరిగ్గా నిల్వ చేయని ఆహారంలో ఫంగస్ వల్ల ఉత్పత్తయ్యే మైకోటాక్సిన్ రోగనిరోధకశక్తిని బలహీనపరుస్తుందని వివరించారు. పరాన్నజీవులు ఆహారాన్ని కలుషితం చేసి గ్యాస్ట్రో ఎంటరైటిస్, లివర్ ఇన్ఫెక్షన్లు, బరువు తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తాయని పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్ లోపల అపరిశుభ్రత వాతావరణంలో ‘లిస్టిరియా మోనోసైటోజీన్స్’ బ్యాక్టీరియా పెరుగుతుందని వెల్లడించారు. ఇది గర్భిణులు, నవజాత శిశువులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో మెనింజైటిస్, సెప్సిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు. National Library of Medicine అధ్యయనంలో ఫ్రిజ్​లో సరైన రీతిలో ఆహారాన్ని నిల్వ చేయకపోతే, అతిసారం, పోషకాహార లోపాలు పెరిగే అవకాశం ఉందని తేలింది. ‘ఇండియన్ మెడికల్ అసోషియేషన్’ అధ్యర్యంలో మన దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ శుభ్రతకు అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదని వెల్లడైంది.

Exit mobile version