NTV Telugu Site icon

Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?

Gold Standard Burger

Gold Standard Burger

Gold Standard Burger: ‘బర్గర్’ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫాస్ట్ ఫుడ్ లో ఒకటి. తక్కువ ధర, తక్కువ సమయం అందుబాటులో ఉండటం, వెంటనే ఆకలి తీర్చడంలో బర్గర్ సహాయపడుతుంది. తక్కువ ధర, టేస్ట్ దీన్ని ప్రజలకు దగ్గర చేసింది. వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బర్గర్.. ఇప్పుడు భారత్ లో కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Read Also:PM Modi: “యుద్ధాన్ని ఆపేందుకు సాధ్యమైనదంతా చేస్తాం”.. ఉక్రెయిన్‌కు ప్రధాని హామీ..

చాలా సార్లు బర్గర్లు నామమాత్రపు ధరలకే లభిస్తుంటాయి. కొన్ని ఫ్యాన్సీ రెస్టారెంట్లో మాత్రమే కొద్దిగా ధర ఎక్కువగా ఉంటుంది. అయితే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మాత్రం ఓ బర్గర్ ధర భయపెడుతోంది. ఏకంగా 700 డాలర్లు అంటే రూ. 55,000 కంటే ఎక్కువ ధరలతో ‘డ్రూరీ బీర్ గార్డెన్’ అనే రెస్టారెంట్ ఈ సరికొత్త చీజ్ బర్గర్ ను తీసుకువచ్చింది. ‘గోల్డ్ స్టాండర్డ్ బర్గర్’ పేరుతో ఈ సరికొత్త కాస్టీ బర్గర్ ను ఈ రెస్టారెంట్ తీసుకువచ్చింది. మిడ్ టౌన్ విలేజ్ లో కొత్తగా రీఓపెన్ చేసిన రెస్టారెంట్ లోని మెనూ ఈ బర్గర్ ను కలిగి ఉంది.

నాణ్యమైన పదార్థాలను ఈ బర్గర్ తయారీలో వాడటంతో ఇంత ధర పలుకుతోంది. ప్రపంచంలోనే నాణ్యమైన బీఫ్ మాంసం అయిన ‘వాగ్యు స్టేక్’ తో పాటు ఐరిష్ చెద్దార్, హనీ, కాల్చిన లోబ్ స్టర్, ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ బర్గర్ లోపల ఉంచుతారు. బ్రియోచీ బన్ ను బంగారు కవర్ తో అలంకరించి ఈ బర్గర్ ను తయారు చేస్తారు. మనుకా తేనెతో చేసిన ఫ్రైస్ తో ఈ బర్గర్ ను అందిస్తారు. డ్రూరీ బీర్ గార్డెన్ రెస్టారెంట్ మే 19, 2023లో ప్రారంభించబడింది.