Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandai Masala Recipe: వేసవి వేడిని తట్టుకోవడానికి శరీరాన్ని చల్లబరచే పానీయాలు ఎంతో అవసరం. అలాంటి వాటిలో సాంప్రదాయ భారతీయ పానీయం తండై ఒకటి. రుచి, సువాసనతో పాటు శరీరానికి చల్లదనం ఇచ్చే ఈ పానీయం, ముఖ్యంగా వేసవిలో తాగితే అలసటను తగ్గించి శక్తినిస్తుంది. మార్కెట్లో లభించే రెడీమేడ్ మిశ్రమాల కంటే ఇంట్లో తయారు చేసిన తండై మసాలా మరింత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. తండై మసాలాలో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, గింజలు, సుగంధ ద్రవ్యాలు శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా, లోపలి నుండి చల్లదనం కలిగిస్తాయి. ఇందులో ఉండే సోంపు, గసగసాలు, కుంకుమపువ్వు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, శరీరాన్ని శాంతంగా ఉంచుతాయి.
తండై మసాలాకు కావలసిన పదార్థాలు
* అర కప్పు బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు..
* రెండు టేబుల్ స్పూన్లు సోంపు..
* 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, గసగసాలు..
* 25-30 పచ్చి యాలకులు
* ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
* 1-2 టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు
* అర టీస్పూన్ కుంకుమపువ్వు.
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
తయారీ విధానం
ముందుగా అన్ని డ్రైఫ్రూట్స్, గింజలను శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టాలి. వాటిలో తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తరువాత యాలకులు, నల్ల మిరియాలు, సోంపు, గసగసాలను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. తరువాత బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చకాయ గింజలను వేసి మళ్లీ రుబ్బాలి. ఈ మిశ్రమం కొద్దిగా గరుకుగా లేదా మెత్తగా అయ్యాక, ఎండిన గులాబీ రేకులు, కుంకుమపువ్వు వేసి మరోసారి తేలికగా రుబ్బాలి. దీంతో మంచి సువాసనతో కూడిన తండై మసాలా సిద్ధమవుతుంది. తయారైన మసాలాను పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని చల్లని, పొడి ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
తండై తయారీ విధానం
ఒక గ్లాసు చల్లని పాలలో 1-2 టీస్పూన్ల తండై మసాలా కలిపి, తగినంత పంచదార వేసి బాగా కలపాలి. చల్లగా వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇలా ఇంట్లోనే తండై మసాలా తయారు చేసుకుని వేసవిలో ఆరోగ్యంగా, చల్లగా ఉండండి. ఒకసారి తాగితేనే ఈ రుచిని ఎవరూ మరచిపోరు.. మళ్లీ మళ్లీ అడుగుతారు..
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!