Mushroom Curry Recipe: చికెన్ కర్రీ ఎందుకు..? మష్రూమ్ కర్రీ ఉండగా.. సూపర్ సాఫ్ట్ గా చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mushroom Curry Recipe: రోజూ తినే చికెన్, మటన్ కర్రీలు బోర్ కొట్టాయా? సాధారణంగా నాన్-వెజ్ ప్రియులు చికెన్ కర్రీని ఎంతగా ఇష్టపడతారో, వెజిటేరియన్స్ అంతకంటే ఎక్కువగా మష్రూమ్ (పుట్టగొడుగుల) కర్రీని ఇష్టపడతారు. రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఇంట్లోని మసాలాలతోనే ఎంతో సాఫ్ట్‌గా, రుచిగా తయారయ్యే ఈ స్పెషల్ వెజ్ రెసిపీ తయారీ విధానం మీకోసం. ఇది రైస్, చపాతీ లేదా బిర్యానీలోకి అద్భుతమైన కాంబినేషన్.
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
కావలసిన పదార్థాలు:
* మష్రూమ్స్: 200 గ్రాములు
* ఉల్లిపాయ తరుగు: 1 కప్పు (సన్నగా తరిగినవి)
* టమాటా: 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
* పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
* పచ్చి కొబ్బరి: చిన్న ముక్క
* మసాలా దినుసులు: దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర
* పొడులు: పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు (రుచికి సరిపడా)
* నూనె: 3 టేబుల్ స్పూన్లు
* అదనంగా: పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర
తయారీ విధానం:
మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేయండి. వీటికి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, చిన్న పచ్చి కొబ్బరి ముక్క, ఒక టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే ఈ గ్రేవీకి అసలైన రుచిని ఇస్తుంది.
పోపు, ఉల్లిపాయల వేయించుట:
స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారి నూనె తేలే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే గ్రేవీ అంత రుచిగా ఉంటుంది. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
గ్రేవీ తయారీ:
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను పాన్‌లో వేసి మంటను తక్కువలో ఉంచి వేయించాలి. మసాలా నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!
మష్రూమ్స్ ఉడికించడం:
శుభ్రం చేసి కట్ చేసుకున్న 200 గ్రాముల మష్రూమ్ ముక్కలను ఈ మసాలాలో వేసి 2-3 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కలపండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా (అర కప్పు నుండి ముప్పావు కప్పు) నీళ్లు పోసి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.
ఫినిషింగ్ టచ్:
గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర లేదా కొంచెం కసూరి మేతిని నలిపి పైన చల్లుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!