Raw Mango Curry Recipe: పప్పు-అన్నానికి అదిరే జోడీ.. వేళ్లను కూడా వదలకుండా నాకించే పచ్చి మామిడికాయ కూర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raw Mango Curry Recipe: వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో పచ్చి మామిడికాయల సువాసన మొదలవుతుంది. ఈ సీజన్లో పచ్చి మామిడికాయతో చేసే వంటకాలు భోజనానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ముఖ్యంగా సాదాసీదా పప్పు-అన్నం, రోటీ లేదా పరాటాలకు కాస్త పులుపు, కారం జత చేయాలనుకుంటే పచ్చి మామిడికాయ కూర అద్భుతమైన ఎంపిక. పుల్లగా, తియ్యగా, కారంగా ఉండే ఈ కూర ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేయాలని అనిపిస్తుంది. పైగా పచ్చి మామిడికాయల్లో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరగడంలోనూ, జీర్ణక్రియ మెరుగుపడడంలోనూ సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు
* పచ్చి మామిడికాయలు – 500 గ్రాములు (పొడవుగా ముక్కలు చేయాలి)
* పచ్చిమిర్చి – సన్నగా తరిగినవి
* కొత్తిమీర – కొద్దిగా
* బెల్లం – రుచికి తగినంత
* నూనె – 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు – అర టీస్పూన్
* జీలకర్ర – అర టీస్పూన్
* మెంతులు – పావు టీస్పూన్
* సోంపు – పావు టీస్పూన్
* నల్ల జీలకర్ర – పావు టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
* పసుపు – అర టీస్పూన్
* కాశ్మీరీ ఎర్ర మిరప పొడి – 1 టీస్పూన్
* ఉప్పు – తగినంత
* నల్ల ఉప్పు – కొద్దిగా
* నీరు – 1 కప్పు
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
తయారీ విధానం
ముందుగా బాణలిలో నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర వేసి వేయించాలి. తరువాత చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలను వేసి 2 నుంచి 3 నిమిషాలు స్వల్పంగా వేయించాలి. తరువాత పసుపు, ఎర్ర మిరప పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మామిడికాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. మామిడికాయలు ఉడికిన తర్వాత బెల్లం వేసి కలపాలి. బెల్లం కరిగి గ్రేవీ చిక్కబడే వరకు మగ్గించాలి. చివరగా కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత కూర మరింత చిక్కగా మారుతుంది.
ఎలా తింటే ఇంకా రుచిగా ఉంటుంది?
ఈ పచ్చి మామిడికాయ కూరను వేడి అన్నం, పప్పు-అన్నం, రోటీ, పరాటా, పూరీలతో వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే నిజంగానే వేళ్లను నాకేస్తారు. వేసవిలో తప్పక ట్రై చేయాల్సిన సంప్రదాయ వంటకం ఇదే.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!