Soya Chunks: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నాన్-వెజ్ తినాలనిపించినా కుదరనప్పుడు.. అందరికీ గుర్తొచ్చే ప్రత్యామ్నాయం ‘మీల్ మేకర్’ (సోయా చంక్స్). అయితే దీనిని హోటల్ స్టైల్‌లో, నాన్-వెజ్ గ్రేవీకి ఏమాత్రం తీసిపోకుండా 10 నిమిషాల్లో సింపుల్‌గా ఎలా వండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కర్రీకి అసలైన రుచిని ఇచ్చేది ఇందులో వాడే స్పెషల్ మసాలా పొడి. జీడిపప్పు, పుచ్చగింజలు, గసగసాలు, ధనియాలు, మిరియాలు, గరం మసాలా దినుసులతో పాటు సొంటిని కూడా కలిపి గ్రైండ్ చేయడం వల్ల దీనికి అద్భుతమైన సువాసన, రుచి వస్తుంది.
తయారీ విధానం ఇదే..
ముందుగా మీల్ మేకర్లను వేడి నీళ్లలో నానబెట్టి, పిండేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కార్న్ ఫ్లోర్ వేసి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన మీల్ మేకర్లను నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించడం వల్ల అవి ముక్కలుగా విడిపోకుండా, తినేటప్పుడు మటన్ ముక్కల్లాంటి ఫీలింగ్‌ను ఇస్తాయి. ఫ్రైడ్ ఆనియన్స్ (బ్రౌన్ ఆనియన్స్), పెరుగు, కొత్తిమీర, పుదీనా కలిపి చేసిన పేస్ట్ ఈ కూరకు మంచి చిక్కదనాన్ని, రిచ్ టేస్ట్‌ను అందిస్తుంది. మీల్ మేకర్ అనేది హై-ప్రోటీన్ ఫుడ్. కాబట్టి శాఖాహారులకు ఇది ఉత్తమమైన పోషకాహారం. ఈ మసాలా కర్రీని అన్నం, చపాతీ, బిర్యానీ లేదా పుల్కా.. ఇలా దేనితో తిన్నా “తగ్గేదేలే” అనేలా ఉంటుంది. మీరు కూడా ఈ వీకెండ్‌లో నాన్-వెజ్ స్టైల్ వెజ్ కర్రీని ట్రై చేయాలనుకుంటే, ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని తప్పక ప్రయత్నించండి..
