Lavash Bread: 6 నెలల వరకు కూడా రొట్టె పాడవదు..! ఎలా చేయాలి.. ప్రత్యేకత ఏమిటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavash Bread: మన ఇళ్లలో తయారుచేసే రొట్టెలు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులకే గట్టిపడి తినడానికి కూడా పనికిరాకుండా పోతాయి. కానీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన రొట్టె ఉంది. దాన్ని ఒకసారి తయారు చేస్తే ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకుని తినవచ్చు. అదే అర్మేనియాకు చెందిన ప్రసిద్ధ ‘లవాష్’ రొట్టె. కాగితంలా పలుచగా ఉండే ఈ రొట్టె కేవలం ఆహారం మాత్రమే కాదు.. అర్మేనియా దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కూడా ప్రతీకగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకున్న ఈ రొట్టెకు ప్రత్యేక గుర్తింపు కూడా దక్కింది.
యునెస్కో గుర్తింపు పొందిన లవాష్
అర్మేనియన్ లవాష్ రొట్టెను 2014లో యునెస్కో “మానవాళి యొక్క అమూర్త సాంస్కృతిక వారసత్వం” జాబితాలో చేర్చింది. దీనికి కారణం దీని ప్రత్యేక తయారీ విధానం, సామాజిక ప్రాముఖ్యత, సంప్రదాయ విలువలు. అర్మేనియాలో లవాష్ తయారీని ఒక కుటుంబ వేడుకగా భావిస్తారు. ఇంటి సభ్యులు కలిసి తయారు చేయడం ద్వారా బంధాలు మరింత బలపడతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.
Also Read
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
- Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
లవాష్ ఎలా తయారు చేస్తారు?
లవాష్ తయారీ చాలా సులభం. దీనికి అవసరమయ్యే పదార్థాలు కేవలం మూడు మాత్రమే.. అవి ఒకటి పిండి.. రెండోది నీరు.. మూడోది ఉప్పు.. ఈస్ట్ ఉపయోగించరు. అందువల్ల ఇది ఆరోగ్యకరమైన రొట్టెగా భావిస్తారు. ముందుగా పిండిని కలిపి ముద్దలా చేసి, చాలా పలుచగా చపాతీలా ఒత్తుతారు. తర్వాత ప్రత్యేకమైన గుడ్డ కుషన్‌పై పరచి, “టోనిర్” అనే సాంప్రదాయ మట్టి పొయ్యి వేడి గోడలపై అతికిస్తారు. కేవలం 30 సెకన్ల నుంచి 1 నిమిషంలోనే ఈ రొట్టె సిద్ధమవుతుంది.
వివాహాల్లోనూ ప్రత్యేక స్థానం
అర్మేనియన్ సంప్రదాయంలో లవాష్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి సమయంలో నూతన వధూవరుల భుజాలపై లవాష్ రొట్టెను ఉంచుతారు. ఇది వారి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆశీర్వాదాలు తీసుకువస్తుందని నమ్మకం.
6 నెలల వరకు ఎలా నిల్వ ఉంటుంది?
తాజాగా తయారైన లవాష్ చాలా మృదువుగా ఉంటుంది. దీనిని చీజ్, కబాబ్‌లు లేదా ఇతర పదార్థాలతో చుట్టి తింటారు. అయితే దీన్ని పూర్తిగా ఎండబెట్టి నిల్వ చేస్తే ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మళ్లీ తినాలనుకున్నప్పుడు దానిపై కొద్దిగా నీళ్లు చల్లితే చాలు.. అది తిరిగి మృదువుగా మారుతుంది. ప్రాచీన కాలంలో లవాష్ ఎక్కువకాలం నిల్వ ఉండే కారణంగా సైనికులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లేవారని చెబుతారు. దీర్ఘకాల ప్రయాణాల్లో ఇది ఎంతో ఉపయోగపడేది.
ప్రపంచాన్ని ఆకట్టుకున్న రొట్టె
సాధారణ పదార్థాలతో తయారయ్యే ఈ లవాష్ రొట్టె ఆరోగ్యకరమైనదే కాకుండా, నిల్వ సామర్థ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఒకసారి తయారు చేసి నెలల తరబడి వాడుకోవచ్చనే కారణంతో ఇది ఇప్పుడు అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!