Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coffee Is Good for Your Heart?: రోజూ ఉదయం కాఫీతో రోజును ప్రారంభించే వారికి ఓ శుభవార్త. మితంగా కాఫీ తాగడం వల్ల కేవలం శరీరానికి ఉత్సాహం మాత్రమే కాదు, గుండె ఆరోగ్యానికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (American Heart Association – AHA) తాజాగా వెల్లడించింది. వైద్యులు చెబుతున్న ప్రకారం.. రోజుకు 8 ఔన్సుల పరిమాణంలో 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగడం గుండె జబ్బులు, గుండె వైఫల్యం (Heart Failure), స్ట్రోక్, టైప్-2 మధుమేహం, అలాగే గుండె స్పందనలో వచ్చే అవకతవకలైన ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది.
అయితే, రోజుకు 5 కప్పులకంటే ఎక్కువ లేదా 400 మిల్లీగ్రాములకు మించి కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె వైఫల్యం ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధన హెచ్చరించింది.. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కేఫిన్ వల్ల మాత్రమే కాకుండా, అందులో సహజసిద్ధంగా ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ (Chlorogenic Acid) వంటి యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాల వల్ల కూడా లభిస్తాయని చెప్పారు. కాఫీ ఎలా తయారు చేసుకుంటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వివరించారు. కాఫీలో అధికంగా చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్స్ కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయని సూచించారు. అలాగే ఫ్రెంచ్ ప్రెస్, టర్కిష్ కాఫీ వంటి ఫిల్టర్ చేయని కాఫీల్లో LDL (చెడు కొలెస్ట్రాల్) పెంచే సమ్మేళనాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే పేపర్ ఫిల్టర్‌తో తయారు చేసిన కాఫీ తాగడం మంచిదని సలహా ఇచ్చారు. డీకాఫ్ కాఫీలో కూడా ఈ సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు.
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
కాఫీ తాగే సమయం కూడా కీలకమని ఆయన చెప్పారు. కేఫిన్ ప్రభావం శరీరంలో 5 నుంచి 6 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగితే నిద్రపై ప్రభావం పడుతుందని, నిద్ర తగ్గడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాఫీతో పోలిస్తే ఎనర్జీ షాట్స్ పూర్తిగా భిన్నమని స్పష్టం చేశారు. వీటిలో అధిక మోతాదులో కేఫిన్తో పాటు ఇతర రసాయన పదార్థాలు ఉండటంతో, ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా గుండె స్పందనలో అసాధారణ మార్పులు (Arrhythmia) వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.
మొత్తంగా చూస్తే, రోజుకు 2 నుంచి 4 కప్పుల ఫిల్టర్ కాఫీ, తక్కువ చక్కెరతో, మితంగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండొచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే కాఫీ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!