Gulab Jamun Paratha Recipe: ఎప్పుడైనా ‘గులాబ్ జామ్ పరాఠా’ రుచి చూశారా..? పిల్లలు ఇష్టంగా తినే స్పెషల్ రెసిపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulab Jamun Paratha Recipe: రోజూ ఒకే రకమైన ఆలూ, పనీర్ పరాఠాలు తింటూ బోర్‌గా ఫీలవుతున్నారా? అయితే ఈసారి తీపి టచ్‌తో ప్రత్యేకంగా ఉండే ‘గులాబ్ జామ్ పరాఠా’ను ట్రై చేయండి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ప్రసిద్ధి చెందిన ఈ స్పెషల్ పరాఠా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది. గోధుమ పిండి, తీపి గులాబ్ జామున్లతో తయారయ్యే ఈ పరాఠా రుచికరంగా ఉండటమే కాదు, ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో లేదా పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇది అద్భుతమైన ఎంపికగా చెప్పొచ్చు.
గులాబ్ జామ్ పరాఠా ప్రత్యేకత ఏంటి?
సాధారణంగా పరాఠాలు అంటే బంగాళదుంప, ఉల్లిపాయ, పనీర్, మెంతి వంటి కూరగాయలతో తయారు చేస్తారు. కానీ ఆగ్రాలో మాత్రం తీపి గులాబ్ జామున్‌తో ప్రత్యేకంగా ఈ పరాఠాను తయారు చేస్తారు. డెజర్ట్‌గా తినే గులాబ్ జామున్‌ను పరాఠాలో ఫిల్లింగ్‌గా ఉపయోగించడం ఈ రెసిపీ ప్రత్యేకత. తీపి రుచిని ఇష్టపడే పిల్లలకు ఇది మరింత ఫేవరెట్‌గా మారుతుంది.
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
కావలసిన పదార్థాలు
* 1 కప్పు గోధుమ పిండి
* 3 నుంచి 4 గులాబ్ జామున్లు
* 2 నుంచి 3 టీస్పూన్లు చక్కెర
* అర టీస్పూన్ యాలకుల పొడి
* వేయించడానికి నెయ్యి లేదా నూనె
* కొద్దిగా పాలు
తయారీ విధానం
* ముందుగా గోధుమ పిండిని గోరువెచ్చని నీరు లేదా పాలతో కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టాలి.
* ఇప్పుడు గులాబ్ జామున్లను ఒక గిన్నెలో వేసి బాగా మెత్తగా చేసి, అందులో యాలకుల పొడి కలపాలి. తీపి ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు.
* తరువాత పిండిని చిన్న ఉండలా తీసుకుని చపాతీలా ఒత్తాలి. మధ్యలో గులాబ్ జామ్ మిశ్రమం పెట్టి అంచులను మూసి మళ్లీ పరాఠాలా ఒత్తాలి.
* పెనంపై కొద్దిగా నెయ్యి వేసి పరాఠాను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఎలా సర్వ్ చేస్తే బాగుంటుంది?
వేడి వేడి గులాబ్ జామ్ పరాఠాపై కొద్దిగా నెయ్యి లేదా చిటికెడు చక్కెర చల్లి వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. కావాలనుకుంటే పెరుగు లేదా క్రీమ్‌తో కూడా తినవచ్చు. ఇంకా రిచ్ టేస్ట్ కోసం మావా లేదా డ్రై ఫ్రూట్స్ కూడా కలపొచ్చు. తీపి, మృదువైన రుచితో ఉండే ఈ ప్రత్యేక పరాఠా ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!