Bachelor Cooking Recipes: బ్యాచ్‌లర్స్‌కి వంట అనేది చాలా పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది. టైమ్ తో పాటు వంట సామాగ్రి సైతం తక్కువగానే ఉంటుంది. ఓపిక కూడా అంతగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కడుపు నిండేలా, రుచిగా, తక్కువ ఖర్చుతో చేసుకునే కర్రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడు వివరించే ఈ రెండు కర్రీలు ప్రత్యేకంగా బ్యాచ్‌లర్స్ కోసం. చేయడానికి చాలా సులభం, కొత్తగా వంట మొదలుపెట్టినవాళ్లకూ ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి.
READ MORE: Indian Citizenship: పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు.. గత ఐదేళ్లలోనే 9 లక్షల మంది
మొదటిది కర్రీ ఉల్లిపాయ–టమాట కర్రీ. ఇది దాదాపు ప్రతీ ఇంట్లో ఉండే సామాగ్రితోనే రెడీ అవుతుంది. ముందుగా ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి అందులో వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ కొద్దిగా బ్రౌన్ కలర్‌కు మారిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. చిటికెడు ఉప్పు, పసుపు, కారం అవసరమంతా వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా మెత్తబడిన తర్వాత స్పూన్‌తో కొంచెం నలిపితే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. చివరగా కొంచెం నీళ్లు పోసి ఒకసారి మరిగించాలి. గ్యాస్ ఆపే ముందు కొద్దిగా కొత్తిమీర ఉంటే వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ అన్నం, చపాతీ రెండింటికీ బాగా సరిపోతుంది.
READ MORE: Andhra Pradesh: 5 జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్‌లు.. ఉత్తర్వులు జారీ
రెండోది గుడ్డు కర్రీ. ఇందులో ప్రోటీన్ సైతం ఉంటుంది. ముందుగా రెండు గుడ్లను నీళ్లలో వేసి బాగా ఉడికించుకుని పొట్టు తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనెలో కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయను తరిగి వేసి వేయించాలి. ఉల్లిపాయ మృదువుగా మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వెల్లుల్లి రెండు రెబ్బలు నూరి వేయచ్చు. అనంతరం టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. టమాటా పూర్తిగా మెత్తబడిన తర్వాత ఉడికించిన గుడ్లను మధ్యలో చీల్చి కర్రీలో వేసి ఒకసారి కలపాలి. కొంచెం నీళ్లు పోసి రెండు నిమిషాలు మరిగించాక గ్యాస్ ఆపాలి. ఇలా చేస్తే సింపుల్‌గా, రుచిగా ఉండే గుడ్డు కర్రీ రెడీ. ఈ రెండు కర్రీలు చేయడానికి పెద్దగా అనుభవం అవసరం లేదు. తక్కువ సామాగ్రితో, తక్కువ టైమ్‌లో రెడీ అవుతాయి.
