Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Broiler Chicken Facts: కరోనా వైరస్ కలకలం తర్వాత ఫుడ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి.. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రోటీన్ ఆహారంగా చికెన్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ల మాంసం తినడం ఆరోగ్యానికి హానికరమని, వాటిని వేగంగా పెంచేందుకు ప్రమాదకరమైన హార్మోన్లు, మందులు వాడతారనే ప్రచారం సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతోంది. అయితే ఈ వాదనల్లో ఎంతవరకు నిజం ఉంది? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఫిట్నెస్ ప్రియుల నుంచి సాధారణ ప్రజల వరకు చికెన్‌ను మంచి ప్రోటీన్ ఆహారంగా భావిస్తారు. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో సుమారు 25 నుంచి 31 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అయితే బ్రాయిలర్ కోళ్లు కేవలం 35 నుంచి 45 రోజుల వ్యవధిలోనే పెద్దవిగా మారడం వల్ల వాటికి గ్రోత్ హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఇస్తారనే అనుమానం చాలా మందిలో ఉంది. కానీ అంతర్జాతీయ పరిశోధనలు, పౌల్ట్రీ నిపుణులు ఈ ప్రచారాన్ని పూర్తిగా అపోహగా కొట్టిపారేస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లకు పెరుగుదల హార్మోన్లు ఇవ్వడం అనేది చట్టవిరుద్ధమని, ప్రపంచంలోని అనేక దేశాల్లో దీనిపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
Also Read
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
హ్యూమన్ లీగ్ నివేదిక ప్రకారం, వేలాది లేదా లక్షలాది కోళ్లకు ప్రతిరోజూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం శాస్త్రీయంగా, ఆచరణాత్మకంగా అసాధ్యం. జీర్ణాశయ వైద్య నిపుణులు కూడా బ్రాయిలర్ కోళ్లపై ఉన్న భయాలు ఎక్కువగా అపోహలేనని పేర్కొన్నారు. “పౌల్ట్రీ ఫారాల్లో ప్రతి కోడికి ప్రతిరోజూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ హార్మోన్లను ఆహారంలో కలిపినా, కోళ్ల జీర్ణవ్యవస్థ వాటిని సాధారణ ప్రోటీన్ల మాదిరిగానే జీర్ణం చేస్తుంది. అందువల్ల వాటి ప్రభావం ఉండదు” అని వివరిస్తున్నారు..
బ్రాయిలర్ కోళ్లు అంత వేగంగా ఎలా పెరుగుతాయి?
అయితే బ్రాయిలర్ కోళ్లు అంత వేగంగా ఎలా పెరుగుతాయి? అనే ప్రశ్నకు నిపుణులు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. బ్రాయిలర్ కోళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన జాతుల ద్వారా అభివృద్ధి చేస్తారు. మంచి జన్యు లక్షణాలు కలిగిన కోళ్లను మాత్రమే పెంపకం కోసం ఎంపిక చేస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా పెరిగే, ఆరోగ్యంగా ఉండే కోళ్ల జాతుల అభివృద్ధిపై ప్రత్యేక పరిశోధనలు జరిగాయి. ఇంకా వాటికి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం అందిస్తారు. నియంత్రిత ఉష్ణోగ్రత, శుభ్రమైన వాతావరణం, సరైన సంరక్షణ కూడా వాటి పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.
ప్రజల్లో యాంటీబయాటిక్స్ భయాలు
మరోవైపు యాంటీబయాటిక్స్ వినియోగంపై కూడా ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయి. కొన్ని పౌల్ట్రీ ఫారాలు కోళ్లను వ్యాధుల నుంచి రక్షించేందుకు యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే మార్కెట్‌కు పంపే ముందు నిర్దిష్ట కాలం పాటు ఆ మందులను నిలిపివేయడం తప్పనిసరి. దీనిని “విత్‌డ్రాయల్ పీరియడ్” అని అంటారు. Healthline వివరాల ప్రకారం, ఈ నియమం వల్ల కోడి మాంసంలో మందుల అవశేషాలు మిగలకుండా చూసే అవకాశం ఉంటుంది. అందువల్ల సరిగా పెంచిన బ్రాయిలర్ చికెన్‌ను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే పరిశుభ్రత లేని ప్రాంతాల్లో తయారైన మాంసం, సరిగా వండని చికెన్ తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాణ్యమైన, విశ్వసనీయ వనరుల నుంచి చికెన్ కొనుగోలు చేసి, పూర్తిగా ఉడికించి తినడం మంచిదని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!