ఉల్లి చేసిన మేలు.. తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లిపాయలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారబోతున్నాయి. మీరు విన్నది నిజమే.. ఉల్లి పాయలపై నల్లటి ఉండడాన్ని మీరు గమనించారా.. అయితే.. కేవలం మచ్చలే అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇది ఒక ఫంగస్.. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అలెర్జీ ప్రతిచర్యలను పెంచుతుంది.
Read Also: Montha Cyclone: వరదలో కొట్టుకుపోయిన యువతీ యువకులు
రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చాలా మందికి తెలుసు. అయితే మీ ఇంట్లో నిల్వ చేసే ఉల్లిపాయలను పరిశీలించకుండా తినడం కొన్నిసార్లు హానీ చేస్తుంది. ముఖ్యంగా ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలా ప్రమాదకరం. నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తింటే ఏమవుతుంది..? ఎలా నిల్వ చేయాలి అనేది తెలుసుకుందాం..మీరు ఉల్లిపాయపై నల్ల మచ్చలను గమనించినట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఆ మచ్చలు ఫంగస్. ఉల్లిపాయలు నేలలో పెరుగుతాయి. ఈ ఫంగస్ అయిన ఆస్పెర్‌గిల్లస్ నైగర్ నేల ద్వారా ఉల్లిపాయలోకి ప్రవేశిస్తుంది. ఈ నల్లటి బూజు అంత త్వరగా ప్రమాదకరం కానప్పటికీ.. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
Read Also:Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు అస్సలు తినకూడదు. ఉబ్బసం, క్షయ, హెచ్‌ఐవీ ఉన్న రోగులు ఈ ఫంగస్‌తో కూడిన ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇవి చాలా హానికరం. ఈ ఫంగస్ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. ఉబ్బసం రోగులలో, ఈ ఫంగస్ అలెర్జీ దాడికి కారణం కావచ్చు. అయితే ఉల్లిపాయపై నల్ల మచ్చలు బయటి తొక్కపై మాత్రమే ఉంటే, దానిని పూర్తిగా తీసివేసి శుభ్రం చేసి వాడుకోవచ్చు. అయితే లోపలి పొరపై కూడా నల్ల మచ్చలు ఉంటే, ఆ ఉల్లిపాయను పొరపాటున కూడా తినకూడదు.
