NTV Telugu Site icon

Health Benefits: ఈ పండు పోషకాల నిధి.. తినడం వల్ల జరిగే లాభాలివే

Eating Banana

Eating Banana

అరటి పండులో తీపితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు దాదాపు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. ఈ పండు పోషకాల నిధి.. దీనిని ప్రజలు తరచుగా అల్పాహారంలో తీసుకుంటారు. చాలామందికి అరటిపండు అంటే ఇష్టముంటుంది. అయితే కొందరికి నచ్చదు. అరటిపండు తినడం వల్ల పొట్టలో కొవ్వును పెంచుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. పొత్తికడుపు ఊబకాయం పెరుగుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది. అరటిపండు తింటే స్థూలకాయం వస్తుందన్న ప్రజల అభిప్రాయం పూర్తిగా తప్పని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండు విసెరల్ కొవ్వును ఏ విధంగానూ పెంచదు. అరటిపండు తింటే బరువు పెరుగుతారని పరిశోధనలు లేవని నిపుణులు తెలిపారు. అరటిపండు ఒక బహుముఖ పండు.. పరిమిత పరిమాణంలో తీసుకుంటే, అది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు అనవసరమైన స్నాక్స్, కుకీలను నివారించి.. అరటిపండును తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి జిమ్‌కి వెళితే, వ్యాయామానికి ముందు అరటిపండు తినండి. అరటిపండులోని సహజ చక్కెర వర్కవుట్‌కు ముందు శరీరంపై ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల శక్తి పుష్కలంగా లభిస్తుంది. అరటి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ B-6, అమైనో ఆమ్లం ఉంటుంది. రోజూ ఒకటి నుండి రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండు తినడం వల్ల జరిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

India: ‘‘తప్పుడు నివేదిక’’.. అమెరికా మతస్వేచ్ఛ రిపోర్టుపై భారత్ ఫైర్..

జీవక్రియ వృద్ధి చెందుతుంది:
అరటిపండులో ఉండే విటమిన్ బి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. అరటి పండు తినడం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అలాగే.. తెల్ల రక్త కణాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. అరటిపండు తీసుకోవడం వల్ల జీవక్రియలు పెరిగి ఊబకాయం తగ్గుతుంది.

కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది:
అరటిపండులో ఉండే ల్యూటిన్ కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రోజూ 1-2 అరటిపండ్లు తీసుకోవడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

మహిళలకు సూపర్ ఫుడ్:
అరటిపండు తీసుకోవడం మహిళలకు సూపర్ ఫ్రూట్. పీరియడ్స్ రాకముందే స్త్రీల శరీరంలో అనేక రకాల శారీరక, ప్రవర్తనా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో అరటిపండు తింటే ఈ మార్పులు అదుపులో ఉంటాయి.

శక్తి పుంజుకుంటుంది:
మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండే అరటిపండు శరీరంలో శక్తిని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని బలహీనత, అలసట తొలగిపోతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
అరటిపండులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అరటిపండులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటిపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్నవారు రోజూ అరటిపండు తింటే.. ఈ దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు.