Multigrain Flour: మల్టీగ్రెయిన్ పిండితో పొరపాటున కూడా ఇవి కలపొద్దు.. ఆరోగ్యానికి ముప్పు!.. ఏంటి అవి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multigrain Flour: ఇప్పుడు అంతా ప్రొటీన్ ఫుడ్ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ గోధుమ పిండికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే రెడీమేడ్ ప్యాకెట్లు అయినా, ఇంట్లో తయారుచేసుకునే పిండి అయినా.. మల్టీగ్రెయిన్ పిండిని పోషకాల గనిగా భావిస్తున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే సరైన విధంగా కలపకపోతే అదే పిండి ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించే అవకాశముంది.
* మల్టీగ్రెయిన్ పిండిని తయారుచేసే సమయంలో చాలామంది 5 నుంచి 6 రకాల ధాన్యాలను ఒకేసారి కలుపుతుంటారు. కానీ, చాలా రకాల ధాన్యాలు కలపడం వల్ల ప్రతి ధాన్యం నుంచి శరీరం సమర్థంగా పోషకాలను గ్రహించలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధికంగా కలపడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
* ప్రత్యేకంగా సోయాబీన్‌ను ఎక్కువగా కలపడం కొందరికి హానికరం కావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు సోయాబీన్ పరిమాణంపై జాగ్రత్తగా ఉండాలి. అధికంగా వాడితే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* అలాగే శనగలు, మినపపప్పు వంటి పప్పుధాన్యాలను ప్రోటీన్ కోసం ఎక్కువగా కలుపుతుంటారు. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ అధిక మోతాదులో వాడితే రొట్టెలు గట్టిగా మారడం, రుచి తగ్గడం, జీర్ణ సమస్యలు రావడం జరుగుతుంది. మొత్తం పిండి బరువులో శనగల పరిమాణం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
* పప్పుధాన్యాలను అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగే అవకాశమూ ఉంది. కాబట్టి కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
* మల్టీగ్రెయిన్ పిండిని ఆరోగ్యకరంగా తయారు చేయాలంటే మీ శారీరక అవసరాలు, జీర్ణశక్తి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ధాన్యాలను ఎంచుకోవడం మంచిది. తక్కువ రకాల ధాన్యాలను సరైన నిష్పత్తిలో కలిపితేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు. అందుకే మల్టీగ్రెయిన్ పిండి అంటే ఎంత ఎక్కువ ధాన్యాలు కలిపితే అంత మంచిదని భావించకుండా, సమతుల్యంగా తయారు చేసుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!