Fruits And Vegetables Storage: కూరగాయలను, పండ్లను కలిపి స్టోర్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పాడవడం, మొలకెత్తడం చూస్తుంటాం. అయితే కూరగాయను, పండ్లను చెడిపోకుండా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 5 రకాల పండ్లు, కూరగాయలను ఎప్పుడు కలిపి నిల్వ చేయకూడదు. ఒక వేళ కలిపి నిల్వ చేస్తే త్వరగా అవి పండుగా మారడమో, చెడిపోవడమో జరుగుతుంది. తాజాగా ఉంచడం వల్ల పండ్లు, కూరగాయల్లోని పోషక విలువలను అలాగే ఉండేలా చేయవచ్చు. ఒక వేళ చెడిపోయిన పండ్లను తిన్నామంటే అనారోగ్యం పాలవ్వడం ఖాయం. అధిక మొత్తంలో ఇథిలీన్ వాయువులను ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయలను ఎప్పుడూ కలిసి నిల్వ చేయరాదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇథిలీన్ వాయువు పండే ప్రక్రియను వేగవంతం చేస్తుంది మరియు చెడిపోవడానికి దారితీస్తుంది.
1) ఉల్లిపాయలు, బంగాళాదుంపలు:
ఉల్లిపాయలు ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి, ఇది బంగాళాదుంపలు మొలకెత్తడానికి మరియు చెడిపోయేలా చేస్తుంది. మరోవైపు, బంగాళాదుంపలు తేమను విడుదల చేస్తాయి, ఇది ఉల్లిపాయలు బూజుపట్టడానికి కారణమవుతాయి. వీలైనంత కాలం వాటిని తాజాగా ఉంచడానికి, వాటిని విడిగా నిల్వ చేయడం ఉత్తమం.
2) దోసకాయలు – టమోటాలు:
దోసకాయలు, టమోటాలు ఒకదానిపై ఒకటి ప్రభావాన్ని చూపించుకుంటాయి. ఇవి ఒకదానికొకటి పండుగా మారే ప్రక్రియను వేగం చేస్తాయి. కాబట్టి వీటిని కలిపి నిల్వ ఉంచకూడదు. దోసకాయలు విడుదల చేసే తేమ టమోటోలను మరింతగా కుళ్లిపోయేలా చేస్తుంది. టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. దోసకాయలను ప్లాస్లిక్ బ్యాగులో ఉందచి రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయాలి.
3) యాపిల్స్ – క్యారెట్
యాపిల్స్ కూడా ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి, ఇది క్యారెట్‌లు త్వరగా పక్వానికి మరియు చెడిపోయేలా చేస్తుంది. ఈ రెండింటిని ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు. కానీ వీటిని వేరువేరు కంటైనర్లలో మాత్రమే ఉంచి ఫ్రిజ్ లో ఉంచాలి.
4) పీచ్ ఫ్రూట్- అరటి పండ్లు.
పీచ్ ఫ్రూట్ , అరటి పండ్లను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. అరటి పండ్లు విడుదల చేసే ఇథిలీన్ పీచ్ పండ్లను త్వరగా పండుగా మారేందుకు సహకరిస్తాయి. పీచు పండ్లను దీనిని తాజాగా ఉంచాలంటే వేరే కంటైనర్లలో నిల్వ చేయాలి.
5) బ్లూబెర్రీస్ – స్ట్రాబెర్రీస్.
బ్లూబెర్రిస్, స్ట్రాబెర్రీలు కంటే చాలా సున్నితంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలను పాడు చేస్తాయి. కలిపి నిల్వ చేసినప్పుడు బ్లూ బెర్రీలు పాడవుతాయి. స్ట్రాబెర్రీలు విడుదల చేసే ఇథిలీన్ వాయువు, బ్లూబెర్రీలను మెత్తగా బూజుతో తయారవుతుంది.