Foods for Naturally Glowing Skin: అందమైన, కాంతివంతమైన చర్మం కోసం ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే సరిపోవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చర్మం నిజమైన కాంతిని పొందాలంటే సరైన ఆహారపు అలవాట్లు కూడా ఎంతో కీలకం అంటున్నారు.. రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడి సహజమైన మెరుపు వస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్: ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడటంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉసిరికాయ: ఇందులో అధికంగా ఉండే విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం గట్టిపడేందుకు, నల్ల మచ్చలు తగ్గేందుకు సహాయపడుతుంది.
అక్రోట్స్ (వాల్‌నట్స్): చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-E, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపల నుంచి తేమగా ఉంచి వాపును తగ్గిస్తాయి.
శనగ మొలకలు: మొలకెత్తిన శనగలు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి చర్మానికి పోషణ అందిస్తాయి.
మామిడి పండు: మామిడిలో ఉండే విటమిన్-A, C చర్మ కణాల పునరుద్ధరణకు, నల్ల మచ్చలు తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
మరోవైపు ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, మద్యం, వేయించిన స్నాక్స్, సోయా స్టిక్స్, పేస్ట్రీలు వంటి ఆహారాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో అధికంగా ఉండే చక్కెరలు, అనారోగ్యకర కొవ్వులు చర్మంలోని తేమను తగ్గించి ముందస్తు వృద్ధాప్యం, వాపు, కాంతి కోల్పోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలతోనే సహజంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

